టీడీపీ యువ నాయకుడు.. లోకేష్ వ్యూహాలపై వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఆయన నూతన వ్యూహాలతో జగన్ సర్కారును ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇవి సక్సెస్ అవుతున్నాయా ? అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశాలు. ఎందుకంటే.. లోకేష్ ఇప్పటి వరకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. విద్యార్థుల తరఫున ఆయన కొన్నాళ్లు ఉద్యమించారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు పెడతారా? అంటూ.. ఇంటర్ విద్యార్థుల పక్షాన పోరాడారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఒకింత అంతర్మథనంలో పడేసినా.. చివరకు ఈ వ్యూహం సక్సెస్ కాలేదు. ఎందుకంటే.. ఈ విద్యార్థులకు ఉద్యోగాలు రావని.. మార్కులు ఉంటే తప్ప.. ప్రఖ్యాత సంస్థలు వీరిని మున్ముందు గుర్తించవని.. జాతీయ స్థాయిలోనే చర్చసాగింది.
ఇక, తర్వాత.. ఎంచుకున్న మార్గం.. బాధితులను పరామర్శించడం. ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ.. వెంటనే లోకేష్ అక్కడ వాలిపోయి.. వారి తరఫున తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. అయితే.. ఇవి కూడా లోకేష్‌కు కలిసి రావడం లేదని అంటున్నారు. ఎందుకంటే.. ఎక్కడికి వెళ్లినా.. ఆయన మనసు పెట్టి పనిచేయడం లేదని.. కేవలం తన గ్రాఫ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. విమర్శలు వస్తున్నాయి. అలా కాకుండా.. ఏదైనా విషయంపై మనసు పెట్టి పోరాటం చేస్తే.. గ్రాఫ్ తనంతట అదే పెరుగుతుందని చెబుతున్నా.. లోకేష్ పట్టించుకోవడం లేదని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పటికే టీడీపీలో ఉన్న కొందరు యువ నాయకులు ఇదే పార్ములా అవలంభిస్తూ.. విజయం దక్కించుకుంటున్నారు. కానీ, లోకేష్ మాత్రం ముందు గ్రాఫ్.. తర్వాతే.. పని..అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా రమ్య హత్య ఘటనను తీసుకున్నా.. ఇదే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. రమ్మ హత్యను అందరూ ఖండించారు. అయితే.. లోకేష్ దీనిని మరింత పెద్దది చేశారు. దీంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి.. రూ.10 లక్షలు ఆ కుటుంబానికి సాయం చేసింది.
అయితే.. మేం చేసిన పోరాటాలవల్లే.. ప్రభుత్వం స్పందించిందని.. తమ నిరసనలతోనే జగన్ వెంటనే రమ్యకుటుంబాన్ని ఆదుకున్నారని.. చెప్పుకోవడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారు. ఎందుకంటే.. ఎవరు ఎలాంటి కామెంట్లు చేయొద్దని.. లోకేష్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో రమ్య కుటుంబానికి మేలు జరిగినా.. టీడీపీ ఖాతాలో మాత్రం దీని తాలూకు ఫలితం వచ్చి చేరలేదు. సో.. ఇదంతా లోకేష్ వ్యూహం లోపమేనని అంటున్నారు నాయకులు. మరి ఇలా అయితే.. ఎలా లోకేషా? అంటున్నారు పరిశీలకులు.