ఆడబిడ్డల రక్షణ గురించి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో...బడికి పోయే ముక్కుపచ్చలారని చిట్టితల్లుల గురించి కూడా అదే రీతిలో కంపితులు కావాలేమో అనే ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా వేర్వేరు చోట్ల జరుగుతున్న సంఘటనల్లో చదివితేనే అలాంటి నరరూప రాక్షసుల గురించి తీవ్రమైన కోపం కలుగుతుంది. కానీ మననేలపై కూడా అలాంటి దుర్మార్గులు ఉన్నారని ఇదిగో ఈ ఘటన తెలుపుతోంది. విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సింది పోయి.. కీచకుడిగా మారాడు ఓ ఉపాధ్యాయుడు. నిత్యం విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న టీచర్ ను బట్టలూడదీసి ఊరేగించారు
ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా...తెలుగు నేలపై తీవ్రంగా చర్చనీయాంశమైన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ పాఠశాలలో జరిగింది. రాంబాబు అనే 40 ఏళ్ల వ్యక్తి ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు. ఓ విద్యార్థిని తన గదికి పిలిపించుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ విద్యార్థిని గర్భం కూడా దాల్చింది. ఐదో నెల వచ్చేసరికి గర్భం పోవడానికి ఈ దుర్మార్గుడు ఆమెకు మందులు కూడా ఇచ్చాడు. దీంతో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆమెను తల్లిదండ్రులు ప్రశ్నించారు. బోరున విలపిస్తూ జరిగిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహ రూపం దాల్చిన స్థానికులంతా కలిసి రాంబాబును తీవ్రంగా చితకబాది.. బట్టలూడదీసి ఏలూరు వీధుల్లో ఊరేగించారు. కీచక టీచర్ రాంబాబుపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అవాంచిత చర్యలకు పాల్పడే దుర్మార్గుల తీరు గురించి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.