6.6 కోట్ల బహుమతి గెలిచి..వెయ్యికి ఇంత కక్కుర్తా?

Update: 2016-04-10 16:41 GMT
ఇటీవలే ఆమె ఉత్తమ టీచర్‌గా ప్ర‌పంచ‌స్థాయి పోటీల్లో గెలిచి అమెరికా గ‌డ్డ‌మీద‌ గ్లోబల్ టీచర్ ప్రైజ్ గెలిచింది. 127 దేశాల నుంచి 1300 మంది పోటీపడితే....అందులో గెలిచి యూఎస్ మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింటన్ చేతుల మీదుగా రూ. 6.6 కోట్ల ప్రైజ్ మనీ పొందిన ఆదర్శ ఉపాధ్యాయురాలు. కానీ ఈ మేడం ఓ స్టోర్లో రూ. 1000 జాకెట్ దొంగతనం చేస్తూ, సెక్యూరిటీకి అడ్డంగా దొరికిపోయింది.

గతనెల 28న డమారిస్కోటా ప్రాంతంలోని ఓ స్టోరుకు వెళ్లిన నాన్సా ఆట్వెల్...‎ ఆమె, అక్కడ ఓ హ్యాంగరుకు తగిలించివున్న జాకెట్‌ను ఫోల్డ్ చేసి, తన హ్యాండ్ బ్యాగ్‌ లో పెట్టేసుకుంది. దీంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆమె మీద కేసు పెట్టారు. దొంగతనం చేయలేదని నిరూపించుకోకుంటే గట్టి శిక్షనే ఎదుర్కోవాల్సి రావచ్చని తెలుస్తోంది.

ఇంత పెద్ద మొత్తం గెలిచి అత్యుత్త‌మ టీచ‌ర్‌ గా గుర్తింపు పొంది అదే స‌మ‌యంలో వెయ్యి రూపాయ‌ల‌కు క‌క్కుర్తి ప‌డటం సిగ్గుచేటే క‌దా?  పెద్ద స్థాయిలో ఉన్న‌వారు అందుకు త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే ఇలాగే ప‌రువు పోగొట్టుకోవాల్సి వ‌స్తుంది.
Tags:    

Similar News