ఏపీ ప్రభుత్వంపై మండితున్న ఉపాద్యాయ లోకం

Update: 2021-11-01 14:44 GMT
ఉద్యోగులే కదా అని ఏపీ ప్రభుత్వం వారి పట్ల నిర్లక్యంగా వ్యవహరించదు. ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలనే తారుమారు చేస్తారని పాలకులకు తెలుసు. అందుకే ఉద్యోగులను మచ్చిక చేసుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఉపాద్యాయుల విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తుంటాయి. ఎందుకంటే ఉపాద్యాయుల్లో ప్రభుత్వంపై వ్యతిరేక వస్తే వారు చేసే ప్రచారం అంతా ఇంతా కాదు. విద్యాశాఖ ఉన్నతాధికారుల అనాలోచితన నిర్ణయాలు ఏపీ ప్రభుత్వానికి నష్టాన్ని కల్గిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వంపై ఉపాద్యాయులు సమరానికి సిధ్దమవుతున్నారు.

విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం 'జ‌గ‌నన్న గోరుముద్ద' ద్వార బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రోజుకో రకమైన రుచులతో పిల్లల కడుపు నింపాలని భావించారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మెనూను ప్రత్యేకంగా తీర్చదిద్దింది. గోరుముద్ద మ‌ధ్యాహ్న‌ భోజ‌న ప‌థ‌కంలో భాగంగా విద్యార్థుల‌కు వారంలో ఐదు కోడిగుడ్లు, మూడు చిక్కీలు విద్యార్థులకు ఇస్తున్నారు. అయితే విద్యార్థులకు అందిస్తున్న ఆహార వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించాలి. ఇందుకోసం ఓ యాప్‌ను కూడా రూపొందించారు. ఈ యాప్‌ల ద్వారా ఆహార సమాచారాన్ని తెలియజేస్తూ ఉండాలి. ఇటీవ‌ల కాలంలో పాఠ‌శాల‌ల‌కు స‌రైన స‌మ‌యంలో ఏజెన్సీలు త‌గిన‌న్ని కోడిగుడ్లు, చిక్కీలు అందించలేదు. ఈ సమాచారాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వానికి పంపలేదు.  

సమాచారాన్ని పంపలేదని ఏకంగా రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల్లో ఉన్న 50 మంది ఎంఈవోలు, 1950 మంది ప్ర‌ధానోపాధ్యాయుల‌కు షోకాజ్ నోటీసులు పంపారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉపాద్యాయులు ఎస్టీయూ ఆధ్వ‌ర్యంలో సోమవారం ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం వైఖరిని ఉపాద్యాయులు తప్పుబట్టారు. జోరు వర్షంలో ధర్నాకు దిగారు. స‌ర‌ఫ‌రా ఏజన్సీల త‌ప్పిదాల‌కు తమను బ‌లి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వం బోధ‌నేత‌ర విష‌యాల‌కు ఉపాధ్యాయుల‌ను ప‌రిమితం చేయ‌డం ద్వారా విద్యార్థుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతోంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. స‌రైన స‌మ‌యానికి స్కూల్‌కు స‌రుకులు స‌ర‌ఫ‌రా చేయ‌ని ఏజెన్సీల‌తో ఇబ్బంది ప‌డుతున్నామ‌ని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్ర‌యోజ‌నం లేద‌ని వాపోయారు. ఉన్న‌తాధికారుల అసంబ‌ద్ధ నిర్ణ‌యాల‌తో ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాన‌సిక ఒత్తిళ్ల‌కు గురి అవుతున్నారని ఎస్టీయూ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News