నాన్సెన్స్.. వన్డేవరల్డ్ కప్ లో టీమిండియా ఫేవరెటా? పరువు తీసిన మైఖేల్ వాన్

Update: 2022-11-16 23:30 GMT
ఇంగ్లండ్ గెలిచింది కాబట్టి ఆ ఇంగ్లీష్ వాళ్లు రెచ్చిపోతున్నారు. అప్పట్లో ఇంగ్లండ్ వెళ్లి మరీ వారిని ఓడించిన టీమిండియా నాడు అక్కసు వెళ్లగక్కారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 కప్ లో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ జట్టు పరువు తీసేలా ఇంగ్లండ్ మాజీలు మాట్లాడుతున్నారు. టీమిండియాపై తరచుగా ఆడిపోసుకునే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్..  భారత జట్టుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సందర్భంతో పనిలేకుండా టీమిండియాపై, జట్టులోకి ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఇంగ్లండ్ విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో గెలుపు మదంతో కొట్టుకుంటూ టీమిండియాను అవమానకర రీతిలో చులకన చేసి మాట్లాడుతున్నారు.

భారత్ వేదికగా వచ్చే ఏడాది 2023 లో వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఇందులో ఫేవరెట్ జట్టు ఏదనే అంశంపై తాజాగా ఇంగ్లీష్ దినపత్రిక టెలిగ్రాఫ్ కు మైఖేల్ వాన్ ప్రత్యేక వ్యాసం రాశాడు. ఇందులో టీమిండియాను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఫేవరెట్ జట్టు మాత్రం కాలేదని.. డిఫెడింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కే ఆ  ట్యాగ్ అర్హత ఉందని గొప్పలకు పోయాడు.

టీ20 వరల్డ్ కప్లో ఇటీవల సెమీఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో అసలు టీమిండియాకు ఫేవరెట్ అనిపించుకునే అర్హతనే లేదని మైఖేల్ వాన్ అవమానకర రీతిలో వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫేవరెట్ అంటే అస్సలు ఒప్పుకోనని.. వరల్డ్ కప్ ఎక్కడ జరిగినా ఫేవరెట్ జట్టుగా ఇంగ్లండ్ ఉంటుందని గర్వంతో వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా లాంటి పేస్ అనుకూలమైన పిచ్ లపైనే సత్తా చాటి వరల్డ్ కప్ నెగ్గిన తమకు భారత్ పిచ్ లపై రాణించి వరల్డ్ కప్ గెలవడం పెద్ద విషయం కాదని అన్నాడు. స్వదేవంలో ఆడుతుంది కాబట్టి టీమిండియానే ఫేవరెట్ అంటే వారితో ఏకీభవించేది లేదని తెలిపాడు.

వన్డే వరల్డ్ కప్లో ఏకైన ఫేవరెట్ ఇంగ్లండ్ నే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకొని మెగా ఈవెంట్లలో జైత్రయాత్ర కొనసాగిస్తుందని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా బీసీసీఐ ఇంగ్లండ్ విన్నింగ్ ఫార్ములాను స్ఫూర్తిగా తీసుకొని టీమిండియాకు అప్లై చేయాలని సూచించాడు. వాన్ చేసిన వ్యాఖ్యలపై  అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News