ఇటీవల ఐటీ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. మూన్‌లైటింగ్. మూన్‌లైటింగ్ అంటే కంపెనీలో ఉద్యోగం చేస్తూనే.. అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయంలో మరో కంపెనీలో ఉద్యోగం చేయడం. దీన్నే ఐటీ పరిభాషలో మూన్‌లైటింగ్ అంటున్నారు.
అయితే ఇలా మూన్‌లైటింగ్ చేయడం కంపెనీలను మోసం చేయడమేనని, కంపెనీ రహస్యాలు వేరే కంపెనీకి వెళ్లిపోతాయని, సున్నితమైన సమాచారం లీకవుతుందని పలు ఐటీ దిగ్గజ కంపెనీలు మూన్‌లైటింగ్‌కు వ్యతిరేకతను ప్రదర్శించాయి. ఎవరైనా ఇలా తమ కంపెనీల్లో పనిచేస్తూ వేరే కంపెనీలో మూన్‌లైటింగ్ చేస్తుంటే వారిని తొలగిస్తామని విప్రో, ఇన్ఫోసిస్ తదితర టెక్ దిగ్గజ కంపెనీలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే మూన్‌లైటింగ్ వ్యవహారంలో మరికొన్ని కంపెనీలు సానుకూలంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అదనపు ఆదాయం కోసం తమ కంపెనీ ఉద్యోగులు గిగ్ జాబ్స్ చేసుకోవచ్చని ఇన్ఫోసిస్ వెల్లడించింది.
అయితే గిగ్ జాబ్ చేయాలంటే తప్పనిసరిగా ఉద్యోగులు తమ మేనేజర్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ గిగ్ జాబ్స్ పోటీ కంపెనీల్లో చేయకూడదు. అలాగే ఇది పరస్పర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉండకూడదని ఉద్యోగులకు స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగులపై పనితీరుపై ఈ డ్యూయల్ జాబ్స్ ప్రభావం ఉండకూడదని వెల్లడించింది. ఈ మేరకు గిగ్ జాబ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో తన కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది.
కాగా మూన్‌లైటింగ్‌కు ఇన్ఫోసిస్ వ్యతిరేకంగా ఉండటంతో చాలామంది మూన్‌లైటింగ్‌కు అనుకూలంగా ఉన్న కంపెనీలకు వెళ్లిపోయే ప్రమాదం ఉండటంతో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
కంపెనీ నుంచి వలసలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఉద్యోగులు అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి గిగ్ జాబ్స్ ఉపయోగపడతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. అయితే గిగ్ జాబ్స్‌ను ఇన్ఫోసిస్ మూన్‌లైటింగ్‌కు పేర్కొనకపోవడం గమనార్హం.
గతంలో మూన్‌లైటింగ్ చేస్తున్నారని ఇన్ఫోసిస్ కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో గిగ్ జాబ్స్ చేసే ఇన్ఫోసిస్ ఉద్యోగులు కంపెనీ పాలసీకి కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. అలాంటి ప్రాజెక్టులను మాత్రమే గిగ్ జాబ్స్‌లో ఎంచుకోవాలని తన ఉద్యోగులకు సూచించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.