ఇంటర్‌నెట్ తో ఈజీగా ప్రాణాలు తీసేసుకున్నాడు!

Update: 2016-10-04 10:27 GMT
ఇంట‌ర్నెట్ ద్వారా అన్నీ నేర్చుకోవ‌చ్చు. చివ‌రికి.. క‌ష్టం లేకుండా ప్రాణాలు తీసుకోవ‌డం కూడా నేర్చుకోవ‌చ్చు! అదే ప‌ని చేశాడు ఢిల్లీకి చెందిన ఒక టెక్కీ. సులువుగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఎలా అనే విష‌యంపై బాగా సెర్చింగ్ చేసీ చేసీ చివ‌రికి ఒక ఈజీ మెథ‌డ్ క‌నుగొన్నాడు. ఆ ప‌ద్ధ‌తిని ప‌క్కాగా ఫాలో అయిపోయాడు. చివ‌రికి ... చ‌నిపోయాడు!

విజ్ఞానం కోసం ఇంట‌ర్ నెట్ ని వాడుకునేవారు చాలామంది ఉంటారు. దాన్ని వినాశ‌నానికి కూడా వాడుకునేవారు కొద్దిమంది ఉంటారు! రెండో ర‌కం ఈ టెక్కీ. పాతికేళ్ల ఈ కుర్రాడికి ఉన్న స‌మ‌స్య‌లేంటో తెలీదుగానీ, పరిష్కారం ఆత్మ‌హ‌త్యే అని నిర్ణ‌యించుకున్న‌ట్టున్నాడు. ఆన్ లైన్ ద్వారా కార్బ‌న్ మోనాక్సైడ్ తెప్పించుకున్నాడు. ఏవో ప‌రిశోధ‌నల కోసం అవ‌స‌రమ‌ని చెప్పి కొన్నాడట‌. ఆ సిలిండ‌ర్‌ ను ఒక పాలిథీన్ క‌వ‌ర్ లో పెట్టి లీక్ చేశాడు. ఆ త‌రువాత‌, త‌న త‌ల‌ను దాన్లోకి దూర్చేసి - గ్యాస్ బ‌య‌ట‌కి పోకుండా మెడ చుట్టూ పాలిథీన్ బ్యాగును క‌ట్టేసుకున్నాడ‌ట‌. అంతే, కాసేప‌టిలో అంతా జ‌రిగిపోయింది! ఎలాంటి నొప్పీ బాధా తేలియ‌కుండా చాలా ఈజీగా ప్రాణాలు వ‌ద‌లేశాడ‌ని చెబుతున్నారు. ఆ త‌రువాత‌ - అత‌డు ఉంటున్న అద్దె ఇంట్లో శ‌వాన్ని పోలీసులు గుర్తించారు.

ప్ర‌మాద‌వ‌శాత్తూ కార్బ‌న్ మోనాక్సైడ్ పీల్చి చ‌నిపోయేవారు ఉంటారు. కానీ, ఇలా ప్ర‌మాదాన్ని ఒక సిలిండ‌ర్ లో కొని తెచ్చుకుని మ‌రీ ప్రాణాలు తీసుకున్న వ్య‌క్తి బ‌హుశా ఇత‌గాడే మొద‌టివాడు అయి ఉంటాడ‌ని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిప‌తి ప్రొఫెస‌ర్ సుధీర్ గుప్తా అన్నారు. పోస్ట్ మార్ట‌మ్ అనంత‌రం అత‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న తీరును వైద్యులు వివ‌రించారు. కార్బ‌న్ మోనాక్సైడ్ గురించి డాక్ట‌ర్ చిత్త‌రంజ‌న్ మాట్లాడుతూ... ఈ వాయువు ఆక్సిజ‌న్ కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువ‌గా ర‌క్తంలోని హిమోగ్లోబిన్ లో క‌లిసిపోతుంద‌ని అన్నారు. కాసేప‌ట్లోనే ర‌క్తంలో ఉండాల్సిన ఆక్సిజ‌న్ మొత్తాన్ని ఇదే ఆక్ర‌మించేస్తుందనీ, అక్క‌డి నుంచి క్ష‌ణాల్లో మెద‌డుకు చేరిపోయి ఆక్సిజ‌న్ అందకుండా పోతుంద‌నీ - దాంతో వెంట‌నే మ‌నిషి చ‌నిపోతాడ‌ని ఆయ‌న చెప్పారు. ఈజీ సూసైడ్ గురించి నెట్ లో వెదికేబ‌దులు... ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం ఏంట‌ని కాసేపు ఆలోచించి ఉంటే ప‌రిష్కారం దొరికేది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News