సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది!

Update: 2020-03-02 08:15 GMT
హైదరాబాద్ నగరంలోని హస్తినా పురంలో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒకే  కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం, వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం స్థానికులను కలచి వేసింది. ఈ ఘటనకు గల కారణాలేమిటనేది తెలియరాలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సంఘటనా స్థలం నుంచి ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శనివారం నుంచి ప్రదీప్,ఆయన భార్య ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయని.. ఎక్కడికైనా వెళ్లి ఉంటారని భావించామని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆదివారం కూడా వారు ఫోన్ లో కాంటాక్ట్‌లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. దీంతో నలుగురు విగతజీవులై కనిపించారు. ఇద్దరు పిల్లలు కల్యాణ్ కృష్ణ,జయకృష్ణ, భార్యాభర్తలు ప్రదీప్,స్వాతి పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య కు పాల్పడ్డాడని ప్రదీప్ తండ్రి చెబుతుండగా, కోట్ల ఆస్తి వున్న ప్రదీప్‌ కు అది పెద్ద విషయమేమీ కాదని ప్రదీప్ భార్య తండ్రి చెబుతున్నారు.

ప్రదీప్‌ రాసిన సూసైడ్‌ లో రూ.40లక్షలు అప్పులు ఉన్నట్టు, దాన్ని తీర్చలేక అప్పుల భాదతో ఆత్మహత్యకి పాల్పడుతున్నట్టు రాసాడు అని, కొడుకుగా నేను నిన్ను పోషించాల్సిన వయసు లో.. మళ్లీ నీపై ఆధార పడటం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో తెలిపాడు అని మృతుడి తండ్రి తెలిపాడు.తన పిల్లలు కూడా భారం కావద్దనే ఉద్దేశంతో వారికి పురుగుల మందు ఇచ్చినట్టు చెప్పారు. అయితే కోట్లల్లో ఆస్తులు ఉన్న ప్రదీప్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదని స్వాతి తండ్రి అన్నారు. ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ జాబ్, సొంత ఇల్లు ఉందని.. లక్షల రూపాయాల అప్పుకు ఆత్మహత్య చేసుకోవడం మూర్ఖత్వమో మరేంటో అర్థం కావట్లేదని అన్నారు

శనివారం మధ్యాహ్నమే పిల్లలకు,భార్యకు ప్రదీప్ విషమిచ్చి చంపేసినట్టుగా చెబుతున్నారు. రోజంతా శవాలతోనే ఉన్న ప్రదీప్.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. శనివారం నుంచి వాళ్లెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదని చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News