తెలంగాణలో కరోనా తీవ్రత పెరిగితే అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియాన్ని తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) గా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే.. సకల సౌకర్యాలతో ఇందులో కరోనా చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు.
అయితే గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయినట్టు తెలిసింది. దీంతో కరోనా రోగులు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు.
వెంటనే స్పందించిన వైద్యసిబ్బంది 30 అంబులెన్స్ లలో సిద్ధం చేసి నిన్న రాత్రి హుటాహుటిన కరోనా రోగులను గాంధీకి తరలించారు.
అత్యాధునిక టిమ్స్ ఆస్పత్రిలో నిన్న రాత్రి కరోనా రోగులు ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను గాంధీకి తరలించారు.