ఈసారి ట్రంప్.. హిల్లరీ ఇద్దరూ ఓడిపోయారు

Update: 2016-04-06 06:38 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అభ్యర్థులగా బరిలోకి దిగాలని భావిస్తున్న డెమొక్రాట్లకు చెందిన హిల్లరీ.. రిపబ్లికన్లకు చెందిన ట్రంప్ ఇద్దరికి ఒకేసారి.. ఒకే చోట దెబ్బ పడటం చర్చగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలోకిదిగేందుకు అవసరమైన  ప్రైమరీల్లో కీలకమైన విస్కాన్సిన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో హిల్లరీ.. ట్రంప్ ఇద్దరికి ఎదురు దెబ్బ తగలటం ఆసక్తికరంగా మారింది.

రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న ట్రంప్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి  క్రూజ్ 49 శాతం ఓట్లు సాధిస్తే.. ట్రంప్ కు కేవలం 35 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. అదే సమయంలో డెమొక్రాట్ల విషయానికి వస్తే.. హిల్లరీకి ప్రత్యర్థిగా బరిలో ఉన్న సాండర్స్ కు ఇక్కడ 57 శాతం ఓట్లు లభించాయి. అయితే.. హిల్లరీకి మాత్రం 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తాజాగా ఎన్నికల్లో హాట్ ఫేవరెట్లుగా చెప్పుకుంటున్న హిల్లరీ.. ట్రంప్ లకు ఒకేసారి ఎదురుదెబ్బ తగలటం గమనార్హం.
Tags:    

Similar News