హైకోర్టులో కేసీఆర్ పై తీన్మార్ మల్లన్న పిటీషన్

Update: 2020-07-08 05:45 GMT
తీన్మార్ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టులో మాండమస్ పిటీషన్ దాఖలు చేశారు.

ప్రగతి భవన్ లో 30మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అప్పటి నుంచి సీఎం ఫాంహౌస్ కి వెళ్లారంటున్నారని పిటీషనర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. సీఎం ఫాంహౌస్ కు వెళ్లిపోయినట్లు మీడియాలో చానెళ్లలో ప్రచారం జరుగుతోందని మల్లన్న పిటీషన్ లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వివరించారు. కరోనా సమయంలో సీఎంగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని పిటీషనర్ మల్లన్న హైకోర్టులో పేర్కొన్నారు. సీఎం లేకపోవడం వల్ల ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు.

పీవీ జయంతి నాడు కేసీఆర్ కనిపించారని.. కరోనాపై కేసీఆర్ ఎంతో కృషి చేశారని..మీడియాలో ప్రజలకు అవగాహన కల్పించి ధైర్యం చెప్పారని.. అలాంటి ప్రస్తుతం సీఎం కనిపించడం లేదని ప్రజలు ఆందోళనగా ఉన్నారని మల్లన్న పిటీషన్ లో పేర్కొన్నారు..ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుపాలని తీన్మార్ మల్లన్న హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.
Tags:    

Similar News