బ్రేకింగ్: మోడీ తెలివిగా అడ్డు తొలగించుకున్నాడు

Update: 2019-05-01 11:44 GMT
ప్రధాని మోడీ పోటీచేస్తున్న నియోజకవర్గం వారణాసి. యూపీలోని ఈ నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి కన్ను పడింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ , ఇతర పార్టీల నుంచి నేతలు బరిలో ఉన్నా.. కానీ ప్రధాన పోటీ ఇచ్చేది మాత్రం సమాజ్ వాది పార్టీయే... ఆ పార్టీ వ్యూహాత్మకంగా మాజీ ఆర్మీ జవాన్ అయిన తేజ్ బహదూర్ యాదవ్ ను రంగంలోకి దింపింది.ఈయన సైన్యంలో ఉద్యోగులకు కనీస బోజనం పెట్టడం లేదని వీడియో తీసి రిలీజ్ చేయడంతో సస్పెండ్ అయ్యారు.

వారణాసిలో తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ కూడా వేశారు. మోడీకి షాక్ ఇచ్చేందుకు సమాజ్ వాదీ వేసిన ఈ ఎత్తుగడ బీజేపీని ఇరుకునపెట్టింది. అయితే మోడీకి కొరకరాని కొయ్యగా మారిన తేజ్ బహదూర్ ను ఈసీ ద్వారా చాకచక్యంగా తప్పించింది బీజేపీ.

తాజాగా సరైన పత్రాలు  లేని కారణంగా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి తేజ్ బహదూర్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్టు వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సురేంద్ర సింగ్ ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ప్రధాన పోటీదారుగా ఉన్న సమాజ్ వాదీ బరిలో లేకుండా పోయింది.

మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ ఎస్పీ అభ్యర్థిగా వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు సూచించినట్టుగా మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు పత్రాలను సమర్పించారు. అయినా తప్పుడు కారణాలతో నామినేషన్ ను తిరస్కరించారని.. మోడీకి లబ్ధి చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని తేజ్ బహదూర్ ఆరోపించాడు. దీనిపైతాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.
Tags:    

Similar News