నితీష్ బొమ్మతో : మోడీకి యాంటీగా అదిరే ప్లాన్ తో...?

Update: 2022-08-12 10:32 GMT
బీహార్ రాజకీయం రేపటి దేశ రాజకీయాన్ని మారుస్తుందా అంటే జవాబు అవును అనే వస్తోంది.ఇప్పటిదాకా మోడీకి ఎదురు నిలిచే మొనగాడు అంటూ ఎవరూ జాతీయ స్థాయిలో పెద్దగా కనిపించలేరు. మోడీ విశాలమైన చాతికీ, ఆయన ఇమేజ్ కి మ్యాచ్ చేసే లీడర్ గా ఇపుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ కనిపిస్తున్నారు. మోడీ ప్రధాని అవగా లేనిది నితీష్ అయితే తప్పేంటి అని బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ నిన్నటికి నిన్న బిగ్  సౌండ్ చేశారు.

ఈ రోజు ఆయన నేరుగా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మీట్ అవుతున్నారు. ఆయన ఢిల్లీ టూర్ లో సోనియమ్మకు చెప్పబోయేది ఏంటి అంటే మోడీకి యాంటీగా బలమైన కూటమి కట్టాలని. ఆ విధంగా చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతామని. ఇక లేటెస్ట్ సర్వేలు చూసినా ఇప్పటికిపుడు బీహార్ లో ఎన్నికలు జరిగితే నితీష్, తేజస్వీ కూటమికే అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయని తేలింది. 40 సీట్లు ఉన్న బీహార్ రేపటి ఎన్నికల వేళ కీలకమైన పాత్ర పోషించడం ఖాయం.

దీంతో తేజస్వి యాదవ్ లాలూ వారసుడిగా ఇపుడు చక్రం తిప్పనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి లేకపోతే లోక్ సభ ఎన్నికల తరువాత అయినా బీహార్ కి సీఎం కావాలని తపిస్తున్న తేజస్వి యాదవ్ సీఎం గా ఉన్న నితీష్ ని ప్రధాని అభ్యర్ధిగా ఫోకస్ లో పెట్టి జాతీయ రాజకీయాల వైపు ఆయన్ని నడిపించాలని చూస్తున్నారు.

తనకు ప్రధాని పదవి మీద వ్యామోహం లేదని పదే పదే నితీష్ చెబుతున్నా ఆయన జీవిత చరమాక దశలో దక్కితే అలాంటి పదవే దక్కాలి. ఇప్పటికి పలుమార్లు సీఎం గా చేసిన ఆయనకు ఫ్యూచర్ లో ఆ కుర్చీ ఖాళీగా ఉండదని కూడా తెలుసు. ఇంకో వైపు చూస్తే కాంగ్రెస్ తో కలసి బలమైన విపక్ష కూటమికి ఆర్జేడీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు బీహార్ లో సక్సెస్ అయినట్లుగానే రేపటి రోజున కేంద్రంలో కూడా సర్కార్ ఏర్పాటు చేయగలమని కూడా భావిస్తున్నారు.

ఈ విషయాలు అన్నీ కూడా సోనియా గాంధీతో చర్చించడానికే తేజస్వి యాదవ్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఇక చూస్తే నితీష్ బొమ్మతో విపక్షం బయటకు వస్తే క్రేజ్ పెరుగుతుంది. మోడీ వర్సెస్ నితీష్ అంటే జనాలకు కూడా బెస్ట్ చాన్స్ చాయిస్ గా నితీష్ కనిపించే వీలుంది. అంతే కాదు నీతి నిజాయతీ కలిగిన ఈ బీహారీ బాబు మోడీకి ధీటైన నేత అని కూడా భావించే వీలు ఉంది.

లేటెస్ట్ గా ఇండియా టుడే చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్  లో బీజేపీకి 286 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. అదే కాంగ్రెస్ కి 52 నుంచి 146 సీట్లు వస్తాయని కూడా లెక్క తేల్చింది. అంటే మూడింతలు కాంగ్రెస్ పెరుగుతుంది అన్న మాట. ఇతరులకు 111 సీట్లు దాకా రావచ్చు అని అంచనా వేశారు. ఇదంతా విపక్ష సిబిరం కలసికట్టుగా లేనపుడు. మరి నితీష్ రూపంలో బలమైన అభ్యర్ధిని పెట్టుకుంటే కచ్చితంగా రేపటి రోజున ఢిల్లీలో మోడీని గద్దె దించి పాగా వేయడం అయితే ఖాయమనే అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు చూస్తే నితీష్ బీజేపీని వీడడం గట్టి దెబ్బగా ఆ పార్టీ భావిస్తూ ఉంటే విపక్ష శిబిరంలో మాత్రం ఆనందం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News