కేసీఆర్ సార్.. అవినీతిపై స‌ర్వే రిపోర్ట్ చూశారా?

Update: 2018-05-20 09:53 GMT
మీడియాను ప్ర‌భావితం చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం ఇందుకు మిన‌హాయింపుగా చెబుతుంటారు. దేశంలో బ‌ల‌మైన ముఖ్య‌మంత్రులు చాలామందే ఉన్నా.. వారిపై త‌ర‌చూ నెగిటివ్ వార్త‌లు.. ఆయా ప్ర‌భుత్వాల్లో చోటు చేసుకునే త‌ప్పులు.. కుంభ‌కోణాల గురించి వార్త‌లు బోలెడ‌న్ని వ‌స్తుంటాయి.

కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. మీడియా సంస్థ‌లు చాలానే ఉన్నా.. ఎక్క‌డా ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌లు క‌నిపించ‌వు. ఒక‌.. కుంభ‌కోణాల‌కు సంబంధించిన ప్ర‌త్యేక‌క‌థ‌నాలు ఉండ‌వు. ఆ మీడియా సంస్థ‌.. ఈ మీడియా సంస్థ అన్న తేడా లేకుండా అంద‌రిది ఒకటే బాట అన్న‌ట్లుగా ఉంటుంది.

దీనికి మిన‌హాయింపుగా ఇంగ్లిషు మీడియాలో వార్త‌లు అప్పుడప్పుడు వార్త‌లు వ‌స్తుంటాయి.

తాజాగా అలాంటి వార్తే ఒక‌టి ఇంగ్లిషు మీడియాలో వ‌చ్చింది. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ప్ర‌చురించిన ఒక వార్త‌.. తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు తెర తీసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెల‌కొన్న అవినీతి మీద ఒక స‌ర్వే నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా అవినీతిలో తెలంగాణ రాష్ట్రం షాకింగ్ ర్యాంక్ వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌క‌టించారు.

సెంట‌ర్ ఫ‌ర్ మీడియా స్ట‌డీస్ సంస్థ దేశంలోని 13 రాష్ట్రాల్లోని అవినీతిపై ఒక స‌ర్వే నిర్వ‌హించింది. ఈ  రిపోర్ట్ ప్ర‌కారం అవినీతిలో త‌మిళ‌నాడు మొద‌టిస్థానంలో నిల‌వ‌గా.. తెలంగాణ రెండోస్థానంలో నిలించింది. ఏపీలో దారుణ‌మైన అవినీతి జ‌రుగుతున్న‌ట్లుగా విప‌క్షాలు.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు విరుచుకుప‌డుతున్న ఏపీలో అవినీతి నాలుగో స్థానంలో నిలిచిన‌ట్లు ప్ర‌క‌టించింది.

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అన్న‌ది లేకుండా చేసిన‌ట్లుగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు.. ఆయ‌న కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ సైతం అదే ప‌నిగా చెబుతుంటారు. అందుకు భిన్నంగా తాజాగా వెల్ల‌డైన స‌ర్వే మాత్రం తెలంగాణ‌లో అవినీతి వెనుక‌బ‌డిన రాష్ట్రంగా పేరున్న బిహార్ కంటే ముందు ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. ఈ స‌ర్వే రిపోర్ట్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో?
Tags:    

Similar News