టీ ఏసీబీ చంద్ర‌బాబుకు అనుకూల‌మా..?

Update: 2016-11-15 07:36 GMT
ఏపీ - తెలంగాణ రాష్ట్రాల‌ను భారీస్థాయిలో వేడెక్కించిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్ర‌బాబు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్.. దీనిపై పెద్ద ఎత్తున చంద్ర‌బాబును విమ‌ర్శించారు. చంద్ర‌బాబూ.. నువ్వు దొంగ‌..! అంటూ కేసీఆర్ బాబుపై ఫైరైన తీరు చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలోనే పెద్ద షాక్‌! ఓటు కోసం నోట్ల‌ను ఇచ్చే క్ర‌మంలో బాబు డీలింగ్ వ్య‌వ‌హారం.. ఫోన్ సంభాష‌ణ‌లు వంటివి ఇరు రాష్ట్రాల‌ను కుదిపేశాయి. అయితే, అనూహ్యంగా ఈ కేసు విచార‌ణ మంద‌గించింది.

ఈ కేసులో చంద్ర‌బాబు పాత్ర‌పై పూర్తి విచార‌ణ‌కు మ‌ళ్లీ ఆదేశించాల‌ని కోరుతూ.. వైసీపీ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణకు ఆదేశించింది కోరు. అయితే, చంద్ర‌బాబు .. దీనిపై క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కేసులో సంబంధం లేని వ్య‌క్తి రామ‌కృష్ణారెడ్డి.. కి విచార‌ణ కోరే అర్హ‌త లేద‌ని బాబు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును కొట్టేయాల‌ని అన్నారు. ఇక‌, దీనిపైవిచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ధ‌ర్మాసనం తెలంగాణ ఏసీబీని వివ‌ర‌ణ కొరింది.

సోమ‌వారం ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఏసీబీ త‌ర‌ఫున సీనియ‌ర్ లాయ‌ర్ ర‌వికిర‌ణ్ కుమార్ వాదిస్తూ.. ఈ కేసుతో సంబంధంలేని మూడో వ్య‌క్తి ఆళ్ల‌.. మ‌రోసారి విచార‌ణ కోర‌మ‌నే అర్హ‌త లేద‌ని అన్నారు. చంద్ర‌బాబు రికార్డును నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని, ఇండియ‌న్  ఎవిడెన్స్ చ‌ట్టాల ప్ర‌కారం ఎలా ముందుకు వెళ్లాల‌నే విష‌యంపైనా దృష్టి పెట్టామ‌ని అన్నారు. దర్యాప్తు పురోగతి సరిగా లేదని ఆరోపించడం తగదని అన్నారు.

దర్యాప్తులో కొత్త విషయాలు తేలితే అనుబంధ‌ పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు. అంతేకానీ.. ఆళ్ల పిటిష‌న్‌ ను ఎక్క‌డా తెలంగాణ ఏసీబీ స‌మ‌ర్ధించ‌క‌పోగా.. వ్య‌తిరేకించింది. దీంతో తెలంగాణ ఏసీబీ వాద‌న‌లు షాక్ ఇచ్చాయి.  నిజానికి చంద్ర‌బాబుపై కేసు న‌మోదు చేసిందే తెలంగాణ ఏసీబీ. మ‌రి ఇప్పుడు ఇలా బాబుకు అనుకూలంగా వాద‌న‌లు వినిపించ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News