తెలుగు రాష్ర్టాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న జిమ్మీ బాబు జాడను తెలంగాణ ఏసీబీ కనిపెట్టినట్లు సమాచారం. తెలుగు యువత నాయకుడైన జిమ్మీ ఓటుకు నోటు కేసులో ఆయన ప్రమేయం వెలుగులోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లాడు.
టీఆర్ ఎస్ నామినెటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కుటుంబంతో సంబంధాలు కలిగి ఉండి, అతని ఓటును టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం వేసేలా బేరసారాలు సాగడంలో కీలక పాత్ర వహించినట్లు ఏసీబీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. దీంతో తమ ముందు విచారణకు హాజరుకావాలని జిమ్మీకి గత నెల ఏసీబీ అధికారులు నోటీసు జారీ చేసింది. అయితే జిమ్మీబాబు విచారణకు హాజరుకాలేదు.
మరోవైపు ఈ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన రిపోర్టు ఆధారంగా వచ్చిన నివేదిక లో జిమ్మీ వివిధ నాయకులతో మాట్లాడిన కాల్స్ బయటపడ్డాయని సమాచారం. దీంతో ఈ కేసులో జిమ్మీని విచారించడం వల్ల కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని ఏసీబీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిమ్మీని అదుపులోకి తీసుకుని విచారించడం కోసం ఏసీబీ అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టి తీవ్ర దర్యాప్తు చేయగా ఆయన తణుకులో ఉన్నట్లుగా తేలింది. ఈ కేసు వెలుగు చూసినప్పటి నుంచి తణుకులోని తన అత్తగారింటిలోనే జిమ్మీ షెల్టర్ తీసుకున్నాడని, అందుకు కొందరు టీడీపీ నాయకులు సహాయపడుతున్నారని కూడా తెలంగాణ ఏసీబీకి సమాచారం వచ్చింది.
జిమ్మీని అదుపులోకి తీసుకుని విచారించడానికి ప్రయత్నాలు చేస్తున్న ఏసీబీ అవసరమైతే కోర్టు నుంచి అరెస్టు వారెంట్ తీసుకోవాలని కసరత్తు చేస్తోంది.