ఓటుకు నోటు కేసు వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న ఈ కేసులో దర్యాప్తు తుది దశకు చేరినట్లుగా సమాచారం. కీలకమైన విచారణ కోసం తెలంగాణ ఏసీబీ అధికారులు అత్యున్నత అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ డబ్బులు ముట్టచెపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ డీల్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడారని ఆడియో టేపులు విడుదలయ్యాయి. చంద్రబాబు పాత్రపై తెలంగాణలోని అధికార- ప్రతిపక్షాలే కాకుండా....ఏపీలోని రాజకీయపార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే పెద్దగా అప్‌డేట్లు లేని ఈ కేసులో తాజాగా మరో కీలక అడుగు పడ్డట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇపుడు తెలంగాణ ఏసీబీ కీలక అడుగువేసింది. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోరినట్లు తెలిసింది. రాజ్యాంగపరంగా పొరుగు రాష్ర్ట సీఎంను విచారించాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి అని, అందుకే అనుమతి అడిగారని తెలుస్తోంది. అయితే రాజ్యాంగపరమైన ఇబ్బందులు, సౌలభ్యాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు ఉన్న ప్రక్రియలను అధ్యయనం చేయాలని కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాల ముగిసిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది.