రికార్డు టైంలో తెలంగాణ బడ్జెట్ సెషన్ క్లోజ్

Update: 2017-03-28 04:52 GMT
ఏడాది మొత్తంలో ఒక్కసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు.. మిగిలిన సమావేశాల కంటే సుదీర్ఘంగా సాగుతుంటాయి.ఇందుకు భిన్నంగా తొలిసారి రికార్డు స్థాయిలోస్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగియటం విశేషంగా చెప్పాలి. గతంలో బడ్జెట్ సమావేశాలంటే కనీసం 24 రోజుల పాటు సాగేది. ఇందుకు భిన్నంగా ఈ దఫా మాత్రం13 రోజులకే క్లోజ్ చేసేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సెషన్ అంటే 24 రోజులన్న రూల్ ఉండేది. కానీ.. దాన్ని మార్చేసి..చాలా స్వల్ప వ్యవధిలోనే సమావేశాల్ని ముగించటం గమనార్హం.

సవరించిన తెలంగాణ అసెంబ్లీ నిబంధనల కారణంగా తక్కువ వ్యవధిలోనే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మొత్తం పదమూడు రోజుల పాటుసాగిన బడ్జెట్ సమావేశాల్లో 72.33 గంటల పాటు చర్చ జరగ్గా.. మొతం 65 మంది సభ్యులు సభలో మాట్లాడారు. మొత్తం 168 ప్రశ్నలు.. 192 అనుబంధ ప్రశ్నలకుసభలో సమాధానం ఇచ్చారు. అందరి కంటే అత్యధికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 4.12 గంటలు మాట్లాడగా.. విపక్ష నేత జానారెడ్డి 3.15 గంటలు మాట్లాడారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ 2.08 గంటలు.. బీజేపీ నేత కిషన్ రెడ్డి 2.34 గంటలు మాట్లాడారు. ఇక అధికారపక్షం 29.09 గంటలు మాట్లాడితే.. కాంగ్రెస్ 15.14 గంటలు.. మజ్లిస్5.07 గంటలు.. బీజేపీ 6.32 గంటలు..టీడీపీ 2.57 గంటలు.. సీపీఐ 6 నిమిషాలు.సీపీఎం 1.48 గంటలు మాట్లాడారు.

గవర్నర్ ప్రసంగంతో మొదలైన బడ్జెట్ సెషన్.. 2015-16ఆర్థిక సంవత్సరపు కాగ్ ఆడిట్ రిపోర్ట్ సమర్పణతో ముగిసింది. గవర్నర్ ప్రసంగిస్తుండగా సభలో అనుచితంగా వ్యవహరించారన్నకారణంగా టీడపీ సభ్యులు రేవంత్ రెడ్డి..సండ్ర వెంకట వీరయ్యలను సమావేశాలు ముగిసే వరకూ బహిష్కరించటం తెలిసిందే. గతంతో పోలిస్తే.. ఈ సెషన్ అర్థవంతమైన చర్చల దిశగా సాగింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొత్తం సెషన్ లో 27 నిమిషాల సమయం మాత్రమే దుర్వినియోగం అయ్యింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున చర్చలు ఏ బడ్జెట్ సెషన్లోనూ జరగలేదన్న మాట నిపిస్తోంది. బడ్జెట్ లో ప్రకటించిన అంశాలతో పాటు.. విపక్ష నేతల సూచనల మేరకు..సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల మెస్ చార్జీలు.. హోంగార్డులను రెగ్యులర్ చేయటం లాంటి అంశాలపై పాజిటివ్ గా రియాక్ట్ కావటం విశేషం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News