FDI: తెలంగాణకు రూ.8617కోట్లు, ఏపీకి 638 కోట్లు

Update: 2021-06-25 04:30 GMT
తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి బాటలు పడుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటే.. అదే ఆకర్షణలో ఏపీ ప్రభుత్వం వెనుకబడ్డ తీరు కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వాస్తవ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.

2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.8617 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డీ.ఐ)లు వస్తే ఏపీకి రూ.638 కోట్లు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

ఇక 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు ఏపీకి రూ.1475.99 కోట్లు రాగా.. తెలంగాణకు 4865.19 కోట్లు వచ్చాయి.

ఇక దేశం మొత్తం చూస్తే రూ.6,14,127 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఈ గణాంకాలు విడుదల చేసింది.

వాటాల పరంగా చూస్తే తెలంగాణకు 1.40శాతం పెట్టుబడులు రాగా.. ఆంధ్రప్రదేశ్ కు 0.10శాతం మాత్రమే వచ్చాయి. ఇక తెలంగాణకు అంతకుముందు ఏడాది ఏకంగా 8617.71 కోట్ల విదేశీ పెట్టుబడులు దక్కాయి.
Tags:    

Similar News