భావోద్వేగ రాజకీయాలకు పెట్టింది పేరైన టీఆర్ ఎస్ బాటలోనే నడవాలని భావిస్తోంది తెలంగాణ బీజేపీ. తెలంగాణ ఏర్పాటు ఉద్యమ సెంటిమెంట్ తో ఎదిగిన అధికార పార్టీకి సమాంతరంగా ఎదిగే ఛాన్స్ తమకు మాత్రమే ఉందని బలంగా నమ్ముతున్న తెలంగాణ బీజేపీ నేతలు.. మజ్లిస్ వ్యతిరేక ప్రచారంతో రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా భావోద్వేగ అంశాన్ని బలంగా తెర మీదకు తీసుకొచ్చి.. భారీగా ప్రయోజనం పొందాలని భావిస్తోంది.
సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ ను బీజేపీ గత కొన్నేళ్లుగా చేస్తున్నదే. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సైతం విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారంటూ బీజేపీ నేతలు తరచూ చెబుతుంటారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవం గురించి మాట్లాడిన టీఆర్ ఎస్.. తాను అధికారంలోకి వచ్చిన తరవాత మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయిందన్న బలమైన పాయింట్ ను బేస్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లి భారీ ఎత్తున ప్రచారం చేయాలని కమలనాథులు కసిగా ఉన్నారు.
టీఆర్ ఎస్ నేతల నోట మాట మారటానికి మజ్లిస్ ప్రభావమేనని తేల్చి చెబుతున్న బీజేపీ నేతలు.. ఆ మాటను తెలంగాణ వ్యాప్తంగా బలంగా తీసుకుపోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 15 నుంచి సెప్టెంబరు 17 వరకూ తిరంగా యాత్రను చేపట్టనుండటం తెలిసిందే. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయం కారణంగానే నిజాం తలవంచిన విషయాన్ని గుర్తు చేయటంతోపాటు..దీంతోనే తెలంగాణకు విమోచనం జరిగిందన్న విషయంపై మరింత భారీగా ప్రచారం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.
భావి తరాలకు స్వాతంత్ర్య పోరాటాలు ప్రేరణ ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టటంతో పాటు.. తెలంగాణ అధికారపక్షం మజ్లిస్ కు లొంగిపోయి విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా నిర్వహించటం లేదన్న మాటను ప్రజల మనసుల్లోకి వెళ్లేలా చేయగలిగితే.. రాష్ట్రంలో రాజకీయంగా తమకు తిరుగు ఉండన్న భావనను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. తాము చేపట్టే తిరంగా యాత్రతో మొత్తంగా తిరిగిపోతుందని భావిస్తున్న బీజేపీ నేతల మాటలు తెలంగాణ ప్రజల మీద ఎంత ప్రభావం చూపిస్తాయన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.