రాజాసింగ్.. శివసేన టీ చీఫ్ కానున్నారా?

Update: 2015-12-04 07:47 GMT
తన వివాదాస్పద వైఖరితో తరచూ వార్తల్లోకి ఎక్కే తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కార్పొరేటర్ గా ఉన్న సమయం నుంచి ఆయన తన దూకుడు సాగిస్తున్నారు. హిందుత్వ అజెండాతో  దూకుడుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఈ నెల 10న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న బీఫ్ ఫెస్టివల్ ను తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు.. అవసరమైతే తాను చావటానికి కానీ.. తాను చంపటానికి సైతం సిద్ధమంటూ వ్యాఖ్యలు చేసి వాతావరణాన్ని వేడెక్కించారు.

అంతేకాదు.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీదా.. ఆయన నాయకత్వం మీదా తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన రాజాసింగ్ ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునే విషయంలో రాజీ పడేది లేదని.. ప్రధానమంత్రి స్వయంగా ఆదేశించినా గోమాత మీద తనకున్న ప్రేమతో.. ఆయన మాటను పట్టించుకోనంటూ వ్యాఖ్యలు చేశారు.

ఒక సాదాసీదా బీజేపీ ఎమ్మెల్యే.. ప్రధాని మోడీ మాటల్ని కూడా లెక్క చేయనంటూ బాహాటంగా చెప్పటం ఏమిటన్న విస్మయం వ్యక్తమైంది. అయితే.. అసలు కథ వేరన్న విషయం తాజాగా చెబుతున్నారు. బీజేపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన.. శివసేన పార్టీలో చేరాలని.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు స్వీకరించాలన్న లక్ష్యంతో తాజా హడావుడి అన్న మాట వినిపిస్తోంది. ఒక పార్టీలో సాదాసీదా ఎమ్మెల్యేగా ఉండేకన్నా.. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం మంచిదన్న ఉద్దేశ్యంతో మంటపుట్టించే మాటలు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అయ్యగారి రాజకీయ ప్రయోజనాల కోసం.. వాతావరణం మొత్తం మంటపుట్టేలా మారిపోవాలని అనుకోవటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News