విభజించి.. పాలించు.. ఇదే ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీగా ముందుకెళ్తోంది. యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో ఇదే ఫార్ములాను అప్లై చేసి అధికారంలోకి వచ్చింది. తాజాగా కమళనాథులు తెలంగాణపై యూపీ ఫార్ములానే అప్లై చేసేందుకు నడుంబిగించారన్న వార్త కమలం పార్టీలో విస్తృతంగా సాగుతోంది.
యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కీలక నగరాల పేర్లను మార్చింది. అలహాబాద్ పేరును ప్రయాగరాజ్ గా మార్పు చేసింది. ఇక చిన్న మధ్యతరహా పట్టణాలకు ఉన్న పేర్లను, ఇతర చారిత్రక కట్టడాలకు ఉన్న పేర్లను హిందూ పేర్లతో మార్పు చేసింది.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తెలంగాణలో అమలు చేసేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యే నిజామాబాద్ ను ఇందూరుగా, కరీంనగర్ ను కరినగరంగా మార్చాలని ఆ పార్టీ ఎంపీలు అరవింద్, బండిసంజయ్ ల డిమాండ్ వెనుక అర్థం పరమార్థం ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇప్పుడు తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్ తోపాటు హైదరాబాద్ కు భాగ్యనగరం - మహబూబ్ నగర్ కు పాలమూరు పెట్టాలనే డిమాండ్ ను త్వరలోనే బీజేపీ నేతలు తెరపైకి తీసుకురాబోతున్నట్టు సమాచారం.
దీనివెనుక ఆర్ ఎస్ ఎస్ వ్యూహంతోపాటు ఎంఐఎం-టీఆర్ ఎస్ దోస్తీకి చెక్ పెట్టి హిందుత్వ ఓట్లను ఏకం చేసేందుకు ఈ ఎత్తుగడ వేసినట్టు ఆ పార్టీలో చర్చించుకుంటున్నారట.. సో తెలంగాణలో యూపీ ఫార్ములా మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది వేచిచూడాలి..