మతం - కులం కోణంలో ‘కత్తి’ని వదిలేస్తారా.?

Update: 2018-07-05 08:36 GMT
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ ప్రస్తుతం జనచైతన్య యాత్రతో భాగంగా తెలంగాణ జిల్లాలను చుట్టేస్తున్నారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనను ముగించిన ఆయన ఈరోజు వరంగల్ జిల్లాకు చేరుకున్నారు.  గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రం చేరుకొని విలేకరులతో మాట్లాడారు. మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర పెంచడంతో రైతులు సంతోషిస్తున్నారని అన్నారు. రైతను రాజును చేసిన ఘనత మోడీకి దక్కిందని.. మద్దతు ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు.

ఇక తాజా వివాదంపై లక్ష్మణ్ స్పందించారు. శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం మతం - కులం కోణంలో చూస్తే ఊరుకునేది లేదన్నారు. అవసరమైతే చట్టాన్ని సవరించైనా రాముడిపై వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వరంగల్ జిల్లాలో ఇటీవల బాణాసంచా పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లక్ష్మణ్ సంతాపం తెలిపారు. ఈ ఘటనతో ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడిందని మండిపడ్డారు. మృతులకు 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.


Tags:    

Similar News