టీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాలు..!

Update: 2015-09-02 14:18 GMT
సుదీర్గ విరామం త‌ర్వాత జ‌రిగిన తెలంగాణ‌రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం బుధ‌వారం జ‌రిగింది. చైనా ప‌ర్య‌ట‌న‌కు ముందుగా ఏర్పాటు చేసిన తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అధికారికంగా మంత్రివ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యాలు బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. కొన్ని అంశాల‌కు సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల్లో వ్యాట్ చ‌ట్టానికి మార్పులు చేయాల‌ని భావించ‌టం ఒక కీల‌కాంశం. అయితే.. వ్యాట్ చ‌ట్టంలోని మార్పులు ప్ర‌జ‌ల మీద ప‌డుతున్న భారాన్ని త‌గ్గించేలా ఉంటాయా? లేక‌.. మ‌రింత బాదేలా ఉంటాయా? అన్న‌ది తేల‌న‌ప్ప‌టికీ.. ప‌లు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు క్యాబినెట్ స‌మావేశంలో తీసుకున్నార‌ని చెబుతున్నారు.

=  వ్యాట్ చట్టంలో మార్పులు చేయాలి
=  తెలంగాణ రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ ఏర్పాటుకు ఆమోదం
=  తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఏర్పాటు
=  ఉద్యోగుల డీఏ మంజూరుకు ప‌చ్చ‌జెండా
=  రాష్ట్ర సహకార బ్యాంకు ఏర్పాటుకు ఆమోదం
=  వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి తీర్మానం
=  వృత్తి పన్ను చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపజేయాలి
=  కాళేశ్వరం ఎత్తిపోతల కార్పోరేషన్ ఏర్పాటు
=  మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్లను లాటరీ పద్ధతిన చేపట్టాల‌న్న నిర్ణ‌యం
Tags:    

Similar News