తెలంగాణ స్థానిక‌త మీద క్లారిటీ ఇచ్చారు

Update: 2018-05-19 04:44 GMT
తెలంగాణ రాష్ట్రంలో స్థానికులు ఎవ‌రు? స‌్థానికేత‌రులు ఎవ‌రు?  ఎలా గుర్తిస్తారు?  దానికి ప్ర‌తిపదిక ఏమిటి?  ఇలాంటి సందేహాల‌కు తాజాగా స‌మాధానాలు వ‌చ్చేసిన‌ట్లే. తెలంగాణ స్థానిక‌త మీద క‌డియం శ్రీ‌హ‌రి నేతృత్వంలోని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం రాష్ట్రానికి తాజాగా కొన్ని సిఫార్సుల్ని చేసింది. దీని ప్ర‌కారం ఒక‌టి నుంచి ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కూ వ‌రుస‌గా నాలుగేళ్లు తెలంగాణ‌లో చ‌దివిన వారినే స్థానికులుగా గుర్తించాల‌ని నిర్ణ‌యించారు.

అంతేకాదు.. జిల్లా.. జోన్.. రాష్ట్ర‌స్థాయిల్లోనూ ఇదే విధానాన్ని వ‌ర్తింప‌చేయాల‌న్న సూచ‌న చేశారు. ఉప సంఘం త‌యారు చేసిన నివేదిక‌ను ఉద్యోగ సంఘాల‌కు అంద‌జేసి వారి అభిప్రాయాల్ని ప్ర‌భుత్వం తీసుకోనుంది. ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న స్థానిక‌త‌ను చూస్తే.. నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ వ‌రుస‌గా నాలుగేళ్ల‌పాటు చ‌దివిన వారికి తెలంగాణ‌లో స్థానికులుగా అర్హ‌త క‌ల్పిస్తున్నారు.

తాజాగా ఉన్న రూల్ స్థానంలో కొత్త రూల్ ను తీసుకురానున్నారు. ఇందుకోసం 1971(డి) రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల‌ను కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌తో అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. అదే విధంగా కీల‌క‌మైన మ‌రో నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రెండు జోన్ల వ్య‌వ‌స్థ నుంచి నాలుగు ఓన్ల వ్య‌వ‌స్థ‌గా మార్చ‌నున్నారు. మొద‌టి జోన్ లో ఆదిలాబాద్ ఉంచి సంగారెడ్డి వ‌ర‌కున్న తొమ్మిది జిల్లాలు.. రెండో జోన్లో జ‌గిత్యాల నుంచి ఖ‌మ్మం వ‌ర‌కున్న 11 జిల్లాలు.. మూడో జోన్ లో హైద‌రాబాద్.. రంగారెడ్డి.. మేడ్చ‌ల్ జిల్లాలు ఉన్నాయి. నాలుగో జోన్లో వికారాబాద్ నుంచి సూర్య‌పేట వ‌ర‌కు ఉన్న ఎనిమిది జిల్లాలు ఉండ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న నాలుగు కేడ‌ర్ల స్థానంలో మూడు కేడ‌ర్ల‌కు కుదించారు. కొత్త‌గా వ‌చ్చే కేడ‌ర్ల‌లో జిల్లా.. జోన్.. రాష్ట్ర కేడ‌ర్లు మాత్ర‌మే అమ‌లు చేయ‌నున్నారు.

మొద‌టి జోన్లో

1. అదిలాబాద్‌
2. కుమ‌రంభీం
3. మంచిర్యాల‌
4. నిర్మ‌ల్
5. నిజామాబాద్‌
6. కామారెడ్డి
7. మెద‌క్
8. సిద్దిపేట‌
9. సంగారెడ్డి

రెండో జోన్

1. జ‌గిత్యాల‌
2. పెద్ద‌ప‌ల్లి
3. రాజ‌న్న సిరిసిల్లా
4. క‌రీంన‌గ‌ర్
5. జయ‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి
6. వ‌రంగ‌ల్ న‌గ‌రం
7. వ‌రంగ‌ల్ గ్రామీణం
8. జ‌న‌గామ‌
9. మ‌హబూబాబాద్‌
10. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం
11. ఖ‌మ్మం

మూడో జోన్..

1. రంగారెడ్డి
2. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరి
3. హైద‌రాబాద్‌

నాలుగో జోన్..

1. వికారాబాద్‌
2. మ‌హ‌బూబ్ న‌గ‌ర్
3. వ‌న‌ప‌ర్తి
4. జోగులాంబ గ‌ద్వాల‌
5. నాగ‌ర్ క‌ర్నూల్
6. న‌ల్ల‌గొండ‌
7. యాదాద్రి
8. సూర్య‌పేట
Tags:    

Similar News