న్యాయం చెప్పాలన్నా.. ధర్మం పాటించాలన్నా.. విషయాల మీద అనురక్తి అస్సలు ఉండకూడదు. పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాల్నా? అంటూ మాంచి రైమింగ్ తో విరుచుకుపడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అవును కదా? పెద్దసారు సక్కంగ మాట్లాడిండు అన్న మాట కొందరి నోటి నుంచి వస్తోంది. నిజమే.. కేసీఆర్ మాటలు మస్తుగా ఉండటమే కాదు.. మనం ఏ దిశగా అడుగులు వేయాలన్న మౌలిక ప్రశ్నను ఆయన సంధించారని చెప్పాలి.
ఇంత మంచిగా మాట్లాడిన పెద్ద మనిషి.. తాజా వివాదాలకు మొదలు ఎక్కడ? అన్న ప్రశ్నను ఆయనకు ఆయన ఎందుకు సంధించుకోరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకడు రెచ్చగొట్టాడని తప్పు పట్టినప్పుడు.. వాడు రెచ్చగొట్టటానికి అవకాశాన్ని ఇచ్చినోడిది కూడా తప్పే కదా? మరి..ఒకరి విషయంలో నిప్పులు చెరుగుతూ.. మరొకరి విషయంలో మౌనంగా ఉండటం ఏమిటి? అన్న ప్రశ్నను ఇప్పుడు పలువురు సంధిస్తున్నారు.
రాజాసింగ్ వివాదాస్పద వీడియోను సమర్థించలేం. అలా అని.. వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోకు అనుమతిని స్వాగతించలేం. మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. కొన్ని అంశాల్లో ప్రభుత్వాలు తామరాకు మీద నీటి బొట్టు మాదిరే ఉండాలి.
అంతేకానీ కొన్నింటికి నీతులు.. మరికొన్నింటికి సుద్దులు చెప్పే తీరు అతికినట్లుగా అనిపించదు. సీతారాముళ్ల మీద ఫన్నీగా కామెంట్లు చేసిన హిస్టరీ ఉందని చెప్పే మునావర్ కామెడీ షోను పలు రాష్ట్రాలు అనుమతికి నో చెప్పిన వేళ.. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఓకే చెప్పిందన్నది ప్రశ్నగా మారింది.
అసలీ దరిద్రం మొత్తం షురూ అయ్యింది అక్కడే కదా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. హైదరాబాద్ లో నిర్వహించిన మునావర్ షోకు ఏకంగా రెండువేల మంది పోలీసుల్ని భద్రతగా ఎందుకుఏర్పాటు చేసినట్లు? ఆ షో మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆ షోకు అనుమతికి నో చెప్పేస్తే.. తెలంగాణలో ఈ రోజున నడుస్తున్న రచ్చ అసలు ఆరంభమయ్యేదే కాదన్న మాట వినిపిస్తోంది. అగ్గి అన్నది రాజుకోకూడదు. ఒకసారి రాజుకున్న తర్వాత..దాన్ని ఆర్పేందుకు నానా ఆగచాట్లు పడాలి.
మునావర్ రూపంలో మొదలైన వివాదం అగ్గి పుట్టిస్తే..రాజాసింగ్ అతి ఆజ్యం పోసేలా మారింది. అయితే.. రాజాసింగ్ యవ్వారంపై విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్.. మునావర్ షో విషయంలో అనుమతులకు ఓకే చెప్పి తమ ప్రభుత్వం చేసిన తప్పును అస్సలు పట్టించుకోకపోవటం కూడా సరికాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. శాంతిని నెలకొల్పేందుకు రెండు వర్గాలకు చెందిన వారు ముందుకు రావాల్సిన ఉందని చెప్పక తప్పదు.