కేసీఆర్ మాటంటే మాటే..ప‌ది మందికి పండుగ‌

Update: 2017-03-01 11:47 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎట్ట‌కేల‌కు త‌న ప్ర‌భుత్వంలోని నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీని వేగంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇటీవ‌లే ప‌ద‌వుల‌పై స‌మీక్షించిన కేసీఆర్ మార్చి 8 లోగా నామినేటెడ్ ప‌ద‌వుల‌న్నీ భ‌ర్తీ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం త‌ర‌ఫున 10 కార్పొరేషన్లకు చైర్మన్లను తాజాగా నియమించారు. ఈ సంద‌ర్భంగా  కార్పొరేషన్ల నియామకాల్లో మైనార్టీలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన కార్పొరేషన్లకు మైనార్టీలను నియమించడం ఆస‌క్తిక‌రం.

చైర్మ‌న్లు, ఆయా కార్పొరేష‌న్ల వివ‌రాలు ఇవి.

మీర్ ఇనాయత్ అలీ బాఖ్రీ - సెట్విన్

షేక్ బుడాన్ బేగ్ - తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

సయ్యద్ అబ్దుల్ అలీమ్ - నెడ్‌క్యాప్

మహ్మద్ యూసుఫ్ జాహీద్ - తెలంగాణ స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు

సయ్యద్ అక్బర్ హుస్సేన్ - తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్

కొండబాల కోటేశ్వర్‌రావు - తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

విప్లవ్ కుమార్ - తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్

తాటి వెంకటేశ్వర్లు(ఎమ్మెల్యే) - తెలంగాణ స్టేట్ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్

బొల్లం సంపత్‌కుమార్ గుప్తా - తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్

గౌండ్ల నాగేందర్‌గౌడ్ - తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
Tags:    

Similar News