తెలంగాణలో కొత్త పథకం గ్రామజ్యోతి!

Update: 2015-07-26 16:04 GMT
పంచాయితీ రాజ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డం గ్రామీణ స్థాయిలో ఎవ‌రికి వారే త‌మ తమ ప్ర‌ణాళిక‌లు త‌యారుచేసుకుని అభివృద్ది చేసుకొవ‌డం కోసం తెలంగాణ ప్రభుత్వం 'గ్రామ‌జ్యోతి' అనే కార్యక్రమాని ప్రారంభించారు! గ్రామీణ ప్రాంతాల స‌మ‌గ్ర సమీకృత అభివృద్దే ఈ గ్రామజ్యోతి కార్యక్రమం ముఖ్యౌద్దేశ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నారు! ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజునుంచి ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాబోతుందని, ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు ఖర్చుచేయబోతున్నామని కేసీఆర్ తెలిపారు.
 
గ్రామాలకు వాటి వాటి అభివృద్ధికి రూ. 2 - 6 కోట్ల నిధులు జనాభా ప్రాతిపధికన అందచేస్తామని టి. సీఎం తెలిపారు! ఈ కార్యక్రమానికి సంబందించిన విధివిధానాలు రూపోందించడాని కి గానూ పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఈ సందర్భంగా నియమించారు! ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు, వ్యవశాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉండనున్నారు!
Tags:    

Similar News