మాయదారి మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. దానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టాలెంట్ ను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారిపై కేసీఆర్ ప్రెస్ మీట్ ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా మిస్ కాకుండా చూస్తేస్తున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యన మీడియా సమావేశాన్ని నిర్వహించటం లేదు సీఎం కేసీఆర్. ఆ మధ్యన రోజుమార్చి రోజు కానీ.. రెండుమూడురోజులకు ఒకసారి మీడియా భేటీని ఏర్పాటు చేసి.. ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసేశారు. లాక్ డౌన్ 5.0 ప్రకటన వేళలోనూ.. ఆన్ లాక్ 1.0 టైంలోనూ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది లేదు. సోమవారం రెండు కీలక సమీక్షల్ని నిర్వహించిన నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందన్న మాట వినిపించింది.
అయితే.. అలాంటిదేమీ లేకపోగా.. ప్రెస్ నోట్ రూపంలో వేర్వేరుగా సమీక్షలకు సంబంధించిన వివరాల్ని మీడియాకు పంపారు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించి చాలా రోజులైనప్పటికీ ఆయన ఎందుకు పెట్టలేదు? తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మీడియా ముందుకు రావటానికి కేసీఆర్ ఇష్టపడలేదెందుకు? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మీడియా సమావేశాన్ని నిర్వహించటం ముఖ్యమంత్రికి ఇష్టం లేదంటున్నారు.
పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటం.. మీడియా ప్రతినిధులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ఇష్టం లేకనే.. ప్రెస్ మీట్ నిర్వహించలేదంటున్నారు. సీఎంవో బీట్ చూసే ది హిందూ దినపత్రిక సీనియర్ రిపోర్టర్ రాహుల్ లాంటి వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం కాస్త కష్టమని.. అలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తే డ్యామేజ్ ఎక్కువ అవుతుందన్న ఆలోచనలోనే ప్రెస్ నోట్ తో సరిపెట్టారంటున్నారు. కేసీఆర్ తీరును నిశితంగా గమనిస్తే.. ఏదైనా కొత్త కాన్సెప్టును ప్రజలకు చెప్పే వేళలోనూ.. తాను అనుకున్న ప్రణాళికను అమలు చేసే టైంలోనూ.. కొత్త అంశాల మీద ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే సమయంలోనే మీడియా ముందుకు రావటం కేసీఆర్ లో కనిపిస్తుంది. ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉండే పరిణామాలు ఉంటే.. వాటిని వివరించేందుకు పెద్దగా ఇష్టముండదని చెబుతున్నారు. అందుకే.. చాలా కాలమైనప్పటికీ మీడియా సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించలేదని చెబుతున్నారు.