ఇప్పుడు రాస్తున్న పాట‌ల ముచ్చ‌టేంది కేసీఆర్‌!

Update: 2017-11-13 13:32 GMT
ఏ విష‌యానికి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించ‌ని తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో క‌నిపిస్తుంది. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. రెండు పొగ‌డ‌టంలో కానీ తెగ‌డ‌టంలోకానీ కేసీఆర్ సాటి ఎవ‌రూ రారు. తాను ఆత్మ‌రక్ష‌ణ‌లో ప‌డిన వేళ‌.. ఎదురుదాడి చేసేందుకు అస్స‌లు వెనుకాడ‌రు. త‌న మీద త‌న‌కున్న న‌మ్మ‌కం.. ఇటీవ‌ల కాలంలో పెరిగిన ఆత్మ‌విశ్వాసం పుణ్య‌మా అని కేసీఆర్ మాట‌లు క‌ఠినంగానే ఉంటున్నాయి.

ఉన్న‌ట్లుండి కేసీఆర్ నోట గ‌తం ఎందుకు వ‌చ్చిందంటే.. దానికి కార‌ణం లేక‌పోలేదు. రైతుల‌కు రూ.8వేల పెట్టుబ‌డిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. స‌మైక్య పాల‌న‌లో తెలంగాణ రైతుల ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పుకొచ్చారు. ఎప్ప‌టి మాదిరి స‌మైక్య పాల‌న ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు త‌న మాట‌ల‌తో తాట తీసే కేసీఆర్ ఈసారి అదే తీరును ప్ర‌ద‌ర్శించారు.  

స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ‌కు ఎంత అన్యాయం జ‌రిగిందో తెలిపేందుకు వ్య‌వ‌సాయం.. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై పాట‌లు రాయాల్సి వ‌చ్చింద‌న్నారు.ఊరికే పాట‌లు రాయ‌లేద‌ని.. ప‌ల్లెల దుస్థితిపై క‌వులు త‌మ ఆవేద‌న‌ను పాట‌ల రూపంలో రాశార‌న్నారు. స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్య‌వ‌సాయ గ‌తి ఏమైంద‌న్న ఉద్దేశంతో క‌వులు పాట‌లు రాశార‌న్నారు.

ప‌ల్లె ప‌ల్లెలో ప‌ల్లెర్లు మొలిచే పాల‌మూరులో అన్న పాట రాయాల్సి వ‌చ్చింద‌న్నారు. స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో రైతుల‌కు పెట్టుబ‌డి ఇస్తుంటే విమ‌ర్శించ‌టం త‌గ‌ద‌న్న ఆయ‌న‌.. నిర్మాణాత్మ‌కమైన స‌ల‌హాలు.. సూచ‌న‌లు స‌భ్యులు ఇవ్వాల‌ని కోరారు. అసెంబ్లీలో స‌మైక్య పాల‌న‌లో చోటు చేసుకున్న అన్యాయంపై రాసిన పాట‌ల గురించి చెప్పిన కేసీఆర్‌.. గ‌డిచిన మూడున్న‌రేళ్ల పాల‌న‌లో ప్రజా సంఘాలు.. ఉద్య‌మ నాయ‌కులు రాస్తున్న పాట‌లు.. చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే బాగుంటుంది. చరిత్ర చెప్ప‌టం బాగానే ఉంటుంది. ఆ క్ర‌మంలో వ‌ర్త‌మానాన్ని మ‌ర‌వ‌టం మంచిది కాదు.
Tags:    

Similar News