ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులవీ.. సీఎం కేసీఆర్ తిరుమలకు వెళితే టీడీపీ ఎమ్మెల్యేలు ఓ మోస్తారుగానే చూసుకున్నారు. ఒకరిద్దరు పక్క రాష్ట్రం సీఎం వచ్చాడని తోడుగా ఉండి స్వామి దర్శనం చేయించి పంపించారు. ఏర్పాట్లన్నీ తిరుమల అధికారులే చూసుకున్నారు..
కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ వేరు. జగన్ గెలవగానే మొదట కలిసింది కేసీఆర్ నే. కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆయనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కేసీఆర్ తిరుమల పర్యటనలో కనిపిస్తోంది.
కేసీఆర్ రేణిగుండ విమానాశ్రయంలో దిగడం మొదలు వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆయనకు రెడ్ కార్పేట్ స్వాగతం పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన సహా చాలామంది కేసీఆర్ వెంట ఉండి తిరుమల, తిరుచానూరు సహా అన్ని దేవాలయాలు చూపించారు. సాంప్రదాయ బద్దంగా ఘనంగా ఆయనను రిసీవ్ చేసుకొని ఏర్పాట్లు చేశారు..
ఇక కేసీఆర్ వెంట అన్నీ తానై వ్యవహరించారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చివరకు కేసీఆర్ తిరచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక హైదరాబాద్ తిరుప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుండగా.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. అంత ఇదిగా కోరడంతో కేసీఆర్ కూడా సరేనన్నాడు..
చెవిరెడ్డి స్వగ్రామం అయిన తుమ్మల గుంటలోని ఆయన ఇంటికి కేసీఆర్ వెళ్లారు. అక్కడికి రాగానే సన్నాయి మేళం, వేదమంత్రాలతో సంప్రదాయబద్దంగా కేసీఆర్ దంపతులకు చెవిరెడ్డి అపూర్వ స్వాగతం పలకడం ఆకట్టుకుంది. అనంతరం చెవిరెడ్డి ఇంట్లో సీమ విందును ఆరగించిన కేసీఆర్ రేణిగుంటకు ఎయిర్ పోర్ట్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇలా మొన్నటి వరకు వేరు.. ప్రస్తుతం వేరుగా ఉంది ఏపీ-తెలంగాణ స్నేహాల పరిస్థితి. ఈ మార్పుపై ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం అవుతోంది.