కేసీఆర్ ఒంట‌రిగా మిగిలి పోవాల్సిందేనా.. ఆ విష‌యంలో!!

Update: 2022-04-20 02:30 GMT
ఔను.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ అధినేత‌.. కేసీఆర్.. ఆ విష‌యంలో ఎప్ప‌టికైనా ఒంట‌రిగా మిగి లిపోవాల్సిందేనా? ఆయ‌న క‌లలు కంటున్న‌ట్టుగా... ఆయ‌న భావిస్తున్న‌ట్టుగా.. జాతీయ రాజ‌కీయాల్లో పుంజు కోవ‌డం.. చ‌క్రం తిప్ప‌డం.. త‌న మాట‌ను జాతీయ‌స్థాయిలో ఎర్ర‌కోట‌పై నుంచి వినిపించాల‌ని ఆయ‌న‌కు ఆశ‌లు ఉండొచ్చు.. ఆశ‌యం కూడా పెట్టుకోవ‌చ్చు. కానీ,ప‌రిస్థితులు స‌హ‌క‌రించాలి క‌దా! ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాలి క‌దా! ఎంత ఆశీర్వ‌దించినా.. పార్ల‌మెంటు స్థాయిలో రాజ‌కీయాలు చేసేందుకు కేసీఆర్‌కు ఆశించిన బ‌లం ద‌క్కేలా క‌నిపించడం లేదు.

వాస్త‌వానికి కేసీఆర్‌కు.. రాజ‌కీయాల్లో ఉన్నంత నాలెడ్జ్‌.. వ్యూహాలు.. దేశంలోని చాలా త‌క్కువ మంది నా యకులకు ఉన్నాయి. రాష్ట్ర ఉద్య‌మం నుంచి కూడా ఆయ‌న చాలా వ్యూహాలు వేసుకుంటూ.. విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఇటీవ‌ల కాలంలో వ్యూహ‌క‌ర్త పీకేను పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనికి కార‌ణం.. ఆయ‌న‌పై చేయించుకున్న స‌ర్వేల్లో కొంత వ్య‌తిరేక‌త రావ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  

ఇక‌, పీకేను త‌న వ్యూహక‌ర్త‌గా పెట్టుకుంటున్నట్టు కేసీఆర్ స్వ‌యంగా మీడియాకు చెప్పారు. నిజానికి జాతీ య స్థాయిలో పెద్ద వ్యూహ‌క‌ర్త అయిన‌.. కేసీఆర్‌.. పీకేను వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకోవ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

ఇక‌, జాతీయీ స్థాయిలో  కేసీఆర్ చ‌క్రం తిప్పాలని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను జాతీయ నేత‌గా నిల‌బెట్టాల్సిన అవ‌స‌రం పీకేపై పెట్టార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పాలంటే... పార్ల‌మెంటు స‌భ్యుల సంఖ్య కీల‌కం. రాష్ట్రంలో ప్ర‌స్తు తం 17 లోక్‌స‌భ‌ స్థానాలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా నెగ్గినా. కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని అనుకుంటు న్న ప‌శ్చిమ బెంగాల్ సీఎం, త‌మిళ‌నాడు సీఎం, యూపీ మాజీ సీఎం అఖిల్ వంటివారితో పోల్చితే.. కేసీఆర్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు.

ఇక‌, రాష్ట్రంలోనూ అన్ని స్థానాలు ఆయ‌న‌కు ద‌క్కే ప‌రిస్థితి కూడా లేదు. మ‌రోవైపు.. జాతీయ స్థాయిలో బీజేపీ కూట‌మి, లేదా.. కాంగ్రెస్ కూట‌మి మాత్ర‌మే అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  అలా కాకుం డా.. ప్రాంతీయ పార్టీల కూట‌మి మాత్రం అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో  కేసీఆర్.. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ కూట‌మిలో చేరే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే... తెలంగాణ‌లో ఈ రెండు పార్టీలతోనూ.. కేసీఆర్‌కు శ‌తృత్వం ఉంది. బీజేపీ క‌న్నా కాంగ్రెస్ ఇంకా పెద్ద శ‌తృవుగానే కేసీఆర్ భావిస్తున్నారు.

ఎందుకంటే...  తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటి మెంటు కూడా ఉంది. అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌కు బూత్ స్థాయిలో నాయ‌కులు ఉన్నారు. బీజేపీకి మాత్రం మెట్రో, మునిసిపాలిటీల్లో ఉన్నారు.. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల‌తోనూ..కేసీఆర్ జాతీయ‌స్థాయిలో చేతులు క‌లిపే ప‌రిస్థితి లేదు. పైగా.. ఇంత పోటీలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కేవ‌లం 8 నుంచి 10 స్థాన‌లు మాత్ర‌మే.. కేసీఆర్ ద‌క్కించుకు నే అవ‌కాశం ఉంది.

కానీ, జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న మ‌మ‌తా బెన‌ర్జీ స‌హా ఇత‌ర పార్టీలు భారీ సంఖ్య‌లో లోక్‌స‌భ స‌బ్యుల‌ను క‌లిగి ఉంటారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ పెద్ద‌రికాన్ని .. వారు గౌర‌వించినా.. నాయ‌క‌త్వాన్ని మాత్రం ఒప్పుకొనే ప‌రిస్థితి లేదు. గ‌తంలోనూ ఇదే వివాదం కార‌ణం.. ప్రాంతీయ పార్టీలు ఒక్క‌టి కాలేక పోయాయి.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కేసీఆర్ వేస్తున్న అడుగులు కూడా అంతే అంటున్నారు ప‌రిశీల‌కులు. కాబ‌ట్టి.. ఆయ‌న ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వ‌చ్చే ఫ‌లితాన్ని బ‌ట్టి.. ఒంట‌రిగా మిగిలిపోవ‌డ‌మేన‌ని చెబుతున్నారు. కాబ‌ట్టి.. తెలంగాణ‌ను డెవ‌ల‌ప్ చేసుకుంటే.. బాగుంటుంద‌ని.. తెలంగాణ స‌మాజం సూచిస్తోంది. 
Tags:    

Similar News