కోట్లు ఇస్తేనే సీట్లు..ఇదే కాంగ్రెస్‌ లో కొత్త ట్రెండ్‌?

Update: 2018-11-10 05:53 GMT
తెలంగాణలో ఎన్నిక‌లు హాట్ హాట్‌ గా సాగుతున్నాయి. అప‌ద్ధ‌ర్మ స‌ర్కారుకు సార‌థ్యం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ ఓ వైపు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ఎన్నిక‌ల్లో దూసుకుపోతుండ‌గా ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ఇంకా అభ్య‌ర్థుల ఖ‌రారులోనే అప‌సోపాలు ప‌డుతోంది. మ‌హాకూట‌మి రూపంలో రాజ‌కీయంగా బ‌ద్ద‌శ‌త్రువు అయిన టీడీపీతో జ‌ట్టుక‌ట్టిన కాంగ్రెస్ పొత్తుల పార్టీకి సీట్ల‌ పంప‌కం గురించి ఇంకా సిగ‌ప‌ట్లు ప‌డుతోంది. అయితే, ఇలా కాంగ్రెస్‌లో ఒకవైపు అసమ్మతి జ్వాలలు రగులుతుండగా మరోవైపు ఓ టికెట్ కోసం రూ.3 కోట్లు ముడుపులు ముట్టాయన్న వార్త ఢిల్లీలో పార్టీని మరింత కలవరపెట్టింది. ఏకంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ సార‌థ్యంలోని బృందం ఈ కోట్ల‌కు సీట్లు డీల్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారుతోంది.

తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసేందుకు - టీఆర్ ఎస్‌ ను ధీటుగా ఉండేలా ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు స్క్రీనింగ్ క‌మిటీ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ క‌మిటీ కార‌ణంగానే కాంగ్రెస్ ఇర‌కాటంలో ప‌డింది. అభ్యర్థులను వడపోస్తున్న స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు భక్తచరణ్‌ దాస్ కుమారుడు ఇబ్రహీంపట్నం సీటు ఇప్పించేందుకు రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడని తుంగతుర్తికి చెందిన కాంగ్రెస్ నేత జ్ఞానసుందర్ మీడియా ముందు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. భక్తచరణ్‌ దాస్ కుమారుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు క్యామ మల్లేశ్‌ తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాడని ఆయన చెప్పారు. భక్తచరణ్‌ దాస్ కుమారుడి మాటలను రికార్డు చేసి క్యామ మల్లేశ్ అధిష్ఠానాన్ని బెదిరించాడని ఆయన ఆరోపించారు. కాగా, పార్టీలో కోట్ల‌కు సీట్లు అనే నినాదం తెర‌మీద‌కు రావ‌డం త‌మ పార్టీలోని స్థితికి నిద‌ర్శ‌నం అంటున్నారు.
Tags:    

Similar News