తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు వ్యతిరేకంగా తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ వార్ రూమ్ పై తనిఖీలు చేసిన పోలీసులు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా ఈ కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 12న విచారనకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్ కు తానే ఇన్ చార్జిని అని.. ఇస్తే తనకు నోటీసులు ఇవ్వాలి కానీ.. సునీల్ కనుగోలుకు సంబంధం ఏంటని మల్లు రవి ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే మల్లు రవికి పోలీసులు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఈ కేసులో సునీల్ కనుగోలును నేడు పోలీసులు విచారించారు. అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న హైదరాబాద్ లోని కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడులు చేశారు. ఐదుగురు వ్యక్తుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు దాడి చేసి పోలీసులకు ఈ సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహరచన బృందంలో భాగమైన ఐదుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ప్రతిపక్ష పార్టీలపై కించపరిచే విధంగా ప్రవర్తించినందుకు తమను అరెస్టు చేసినట్లు సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలు చేసేందుకు వచ్చిన అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ వర్గాల ప్రకారం.. సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహం వార్ రూమ్ నిర్వహిస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు దీనిపై దాడి చేసి సోదాలు.. అరెస్టులు చేశారు. ఐదుగురు వేర్వేరు వ్యక్తుల నుంచి తమకు ఐదు ఎఫ్‌ఐఆర్ ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
-సునీల్ కనుగోలు ఎవరు?
సునీల్ కనుగోలు డిఎంకె, ఎఐఎడిఎంకె , బిజెపిలతో కలిసి పనిచేసిన రాజకీయ విశ్లేషకుడు. పోల్ వ్యూహకర్త. అతను కర్ణాటకలో రాబోయే రాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నాడు. పార్టీ కోసం ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహిస్తాడు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశాడు. 2017లో బీజేపీ కోసం ఎన్నికల వ్యూహాన్ని నిర్వహించాడు. 2019లో అతను లోక్‌సభ ఎన్నికల కోసం డీఎంకే వ్యూహాన్ని రచించాడు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే యొక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాడు. అన్నాడీఎంకే వ్యూహం , ఉనికిని పెంచినందుకు.. మాజీ ముఖ్యమంత్రి మరియు పార్టీ అధినేత్రి జయలలిత గైర్హాజరీలో మెజార్టీ సీట్లు సాధించడంలో సునీల్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.