తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు - తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం అనే ఎపిసోడ్ అనేక మలుపులు తిరుగుతోంది.....ఊహించని ట్విస్టులు ఇస్తోంది. ఇటు స్వపక్షమైన టీడీపీతో పాటుగా ఆయన చేరబోయే (!) కాంగ్రెస్ పార్టీలో సైతం ఈ జంపింగ్ కలకలం రేపుతోంది. రేవంత్ కాంగ్రెస్ అరంగేట్రం నేపథ్యంలో గాంధీ భవన్ లో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీరియస్ గా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో ఆయనకు కట్టబెట్టే బాధ్యతల గురించి అధిష్టానానికి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే...ఆయన చేరికకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరాదని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియాకు సూచించారని తెలుస్తోంది. అలాగే చేరిక అనంతరం రేవంత్ కు ఎన్నికల ప్రచార బాద్యతలు అప్పగించరాదని పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా మాట్లాడుతూ కాంగ్రెస్ లోకి రేవంత్ ఎలాంటి షరతులు లేకుండానే వస్తున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం చేరికలకు సహకరించాలని సూచించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతల భేటీతో రేవంత్ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుకుంటారన్న ప్రచారం జోరందుకుంది. నవంబర్ లో రేవంత్ పార్టీ మారనున్నట్లు హస్తం పార్టీ నేతలు అంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఈ పరిణామంపై ఆచితూచి స్పందించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేరికపై నో కామెంట్ అని తెలిపారు. పార్టీ సీనియర్ నేతగా ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారని మీడియా మరోమారు ప్రస్తావించగా....`రేవంత్ విషయాన్ని నాతో ఎవరూ చర్చించలేదు` అంటూ సమాధానం దాటవేశారు.
మరోవైపు కాంగ్రెస్ లో చేరాలని డిసైడయిన రేవంత్... కాంగ్రెస్ హైకమాండ్ తో మంతనాలు సాగిస్తూనే అదే సమయంలో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోనూ టచ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను ఆయన కలిసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ వ్యతిరేకులంతా ఒక్కతాటిపైకి రావాలని, మనమంతా కలిసి నడుద్దామని రేవంత్ సూచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన వెంట భారీగా టీ టీడీపీ నేతలను కాంగ్రెస్ గూటికి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన అనుకూల నేతలు - సన్నిహితులతో రేవంత్ నిత్యం మంతనాలు జరుపుతూ.. తన వెంట కలిసిరావాల్సిందిగా కోరుతున్నారని సమాచారం. ముఖ్యంగా ఏడు జిల్లాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.