సభలో అనుచితంగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్ కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చేసిన ప్రకటన మలుపులు తిరుగుతోంది. శాసనసభ సభ్యత్వాల రద్దును నిరసిస్తూ పలు రూపాల్లో పోరాటం చేయాలని డిసైడ్ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట దీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమపై వేటును ఖండిస్తూ గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి - సంపత్ లు దీక్ష చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనాన్ని కాంగ్రెస్ నేతలు చేపట్టారు. దీనికి కొనసాగింపుగా మరో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు గళం వినిపించడం - అదే సమయంలో న్యాయస్థానాలను ఆశ్రయించడం అనే వ్యూహాలతో అన్ని వేదికల వద్ద తమ వాదనను బలంగా విన్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టును ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశ్రయించారు. మరోవైపు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. స్పీకర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు హైకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పిటీషన్ లో కోమటి రెడ్డి - సంపత్ పేర్కొన్నారు. ప్రొసీడింగ్ ప్రాపర్ గా జరగలేదని ,సభ్యుల వివరణ తీసుకోకుండానే సభ్యత్వాల రధ్ధు, సస్పెండ్ చేయడం రూల్స్ కు విరుద్ధం అని పిటిషన్లో వివరించారు. ఎతిక్స్ - ప్రివలైజ్ కమిటీల అభిప్రాయం తీసుకోలేదు అంతా ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. సభ్యత్వం రధ్దు - సస్పెన్షన్ ల వెనక రాజకీయ దురుద్దేశం ఉందని కోర్టుకు తెలిపారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. హైకోర్టులో మార్చి 16న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దుపై విచారణ జరగనుంది.
ఇదిలాఉండగా...ఢిల్లీలో పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వీహెచ్ - మర్రి శశిధర్ రెడ్డి సహా పలువురు నేతలు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై ఫిర్యాదుచేసి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఇద్దరి వేటుపై వివిధ రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి - సంపత్ ల పిటిషన్ లో వారికి అనూకూలంగా నిర్ణయం సందేహమేనని అంటున్నారు. అసెంబ్లీలో స్పీకర్ కు విచక్షణాధికారం ఉంటుంది.ఈ అధికారం మేరకే నిర్ణయాలు తీసుకొనే హక్కు ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభ గవర్నర్ పరిధిలోకి వస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విచారణ సందర్భంగా కోర్టు ఏం చెబుతోందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కోర్టు తీర్పు సానుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ వర్గాలు యోచిస్తున్నట్లు సమాచారం.