నామినేషన్ల ఘట్టం మొదలైన నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ దూకుడు పెంచింది. సోమవారం 65 స్థానాలకు అభ్యర్థులను ఫైనలైజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా 10 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్విట్టర్ ద్వారా ఈ జాబితాను ప్రకటించింది. తొలిజాబితా - రెండో జాబితాలు కలిపి మొత్తం 75మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించినట్టైంది. మరో 19మందిని ప్రకటిస్తే పొత్తుల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించినట్లు అవుతోంది.
కాంగ్రెస్ రెండో జాబితాలో 10మందిని ప్రకటించింది. ఇందులో ఒక ఎస్సీ - ఒక ఎస్టీ స్థానాలు కూడా ఉన్నాయి. రెండో జాబితాలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యం వేసింది. అయితే ఆశ్చర్యకరంగా రెండో జాబితాలో కూడా పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మంత్రి కేటీఆర్ పై సిరిసిల్లలో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు టికెట్ కేటాయించింది. జూబ్లిహిల్స్ ను విష్ణు వర్ధన్ రెడ్డికి ఇచ్చింది అయితే ఖైరతాబాద్ - జూబ్లిహిల్స్ నియోజకవర్గాలను టీడీపీకి వదిలేయాలని గట్టిగా డిమాండ్ వచ్చినా కాంగ్రెస్ మాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ తాజా మాజీలకే కేటాయించడం విశేషం..
ఇక షాద్ నగర్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి శంకర్ రావుకు నిరాశే ఎదురైంది. అక్కడ ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. మేడ్చల్ ను లక్ష్మారెడ్డికి కేటాయించారు. భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి - ధర్మపురి (ఎస్సీ) అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు - ఎస్టీ నియోజకవర్గమైన ఖానాపూర్ ను రమేష్ రాథోడ్ కు కేటాయించింది. రాథోడ్ కు వద్దని ఆందోళనలు జరిగినా.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆయనకు టికెట్ రిజర్వ్ చేసింది. కనీసం మూడో స్థానం నుంచి అయినా పొన్నాలకు అవకాశం ఇస్తారేమో చూడాలి మరి.. మూడో జాబితాను ఈ సాయంత్రం కల్లా విడుదల చేసే చాన్స్ ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే..
1.ఖానాపూర్ (ఎస్టీ) - రమేష్ రాథోడ్
2. ఎల్లారెడ్డి - జాజల సురేందర్
3. ధర్మపురి (ఎస్సీ) - అడ్లూరి లక్ష్మన్ కుమార్
4. సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి
5. మేడ్చల్ - కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
6. ఖైరతాబాద్ - డా. దాసోజు శ్రవణ్
7. జూబ్లిహిల్స్ - పి. విష్ణు వర్ధన్ రెడ్డి
8. షాద్ నగర్ - సి. ప్రతాప్ రెడ్డి
9. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణా రెడ్డి
10. పాలేరు - కందల ఉపేందర్ రెడ్డి