దేశ పాలనా యవనిక పై నుంచి క్రమంగా కనుమరుగైపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రమాదాన్ని కాస్త ఆలస్యంగా నైనా గుర్తించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు అధికారం అంటే నెహ్రూ-గాంధీ కుటుంబానికే దక్కాలి.. కాంగ్రెస్ పార్టీయే ప్రత్యక్షంగా ఏలాలన్న కాన్సెప్ట్ నుంచి తాత్కాలికంగానైనా దూరం జరిగి ఇప్పుడున్న అధికార పార్టీలను ఎలాగైనా ఓడించాలని తాపత్రయ పడుతోంది. అందులో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించుకుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఆ పార్టీ తమ నేత రాహులే పీఎం కావాలని లేదని.. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడి, ఇతరులెవరైనా పీఎం అయినా తాము సహకరిస్తామని గుండె రాయి చేసుకుని ఓపెన్ గా చెప్పేసింది. ఇప్పుడు రాష్ట్రాల్లోనూ కొత్త పార్టీలతో కూడా మంతనాలు జరుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణలో కోదండరాం పార్టీతో పొత్తు దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. పార్టీని విలీనం చేస్తామని చెప్పి హ్యాండిచ్చి తమను నిలువునా మోసగించారన్న కసి సోనియాలో తీవ్రంగా ఉందని.. అందుకే.. ఎలాగైనా కేసీఆర్ ను ఓడించాలని కంకణం కట్టుకున్న ఆమె తెరాసయేతర పార్టీలన్నిటితోనూ కలిసి నడిచేందుకు మానసికంగా సిద్ధమైపోయిందట. ఇప్పటికే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖరారు కాగా ఇప్పుడు కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితితోనూ కలిసి నడవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సాదించుకున్నప్పటికి ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయకపోవడంతో సమాజంలో వ్యత్యాసాలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలంగాణ జనసమితి ప్రజల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలో అధికార టీఆర్ ఎస్ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి టీజేఎస్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఎలాగూ కాంగ్రెస్ వ్యూహం కూడా ఇదే కావడంతో టీజేఎస్ - కాంగ్రెస్ ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయి.
టీఆర్ ఎస్ ను అధికారంలోకి రాకుండా చేయడమే ఈ రెండు పార్టీల లక్ష్యం కావడంతో కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు విడివిడిగా పోటీచేస్తే టీఆర్ ఎస్ వ్యతిరేక ఓటు చీలుతుందని..తద్వారా టీఆర్ ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే టీఆర్ ఎస్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఒకవైపు టీజేఎస్ - మరోవైపు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. టీఆర్ ఎస్ వ్యతిరేక ఓట్లను దూరం చేసుకోకుండా సంప్రదింపులు జరపాలని అధిష్టానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచనలు అందుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఉత్తమ్ కుమారే స్వయంగా కోదండరాంతో భేటీ అయినట్టు తెలుస్తోంది. కోదండరాం పార్టీ పెట్టడంతో ఓటుబ్యాంక్ చీలే అవకాశం ఉందని, అది అంతిమంగా అధికారపార్టీకే లాభిస్తుందని కోదండకు ఉత్తమ్ సూచించినట్టు సమాచారం. యువత - విద్యార్థులు - జేఏసీ నేతలు తనపై తీవ్ర ఒత్తిడి తేవడంతోనే పార్టీ పెట్టాల్సి వచ్చిందని కోదండరాం ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఒక సామాజిక వర్గం సైతం కాంగ్రెస్ - టీజేఎస్ లకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార పార్టీకి వ్యతిరేకంగా సీపీఐ కూడా వీరికి మద్దతు ప్రకటించింది. త్వరలో రాహుల్ తెలంగాణ పర్యటన ఉండడంతో ఆ తరువాత క్లారిటీ వస్తుందని సమాచారం.