కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఇక పనిచేయనక్కర్లేదట..!

Update: 2018-11-28 11:21 GMT
మహాకూటమి.. అందులో నాలుగు పార్టీలు.. కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - టీజేఎస్.. సీట్లు పంచుకొని ఒక్కటిగా పోటీచేస్తున్నాయి. అలాంటప్పుడు అన్ని పార్టీలు కలిసి ఒకటే మేనిఫెస్టో పెట్టుకొని ముందుకెళ్లాలి. కామన్ మినిమం ప్రోగ్రాం విడుదల చేయాలి. ప్రజలకు కూటమిగా ఏం చేస్తామో చెప్పాలి. కానీ పార్టీకొక మేనిఫెస్టోను కూటమి నేతలు విడుదల చేశాయి. 

ఈసారి కాంగ్రెస్ డూ ఆర్ డై ఫైట్ కు సిద్ధమైంది. ఇప్పటికే 2014లో దెబ్బైపోయిన కాంగ్రెస్ ఈసారి గెలవడం కూడా ముందు వెనుకా ఆలోచించకుండా వరాల వాన కురిపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూస్తే అందరూ సంభ్రమాశ్చార్యాలకు లోను కాకుండా ఉండలేకపోతున్నారు.

కాంగ్రెస్ తాజాగా మేనిఫెస్టో విడుదల చేయగా.. కోదండరాం ఇప్పటికే ఒకటి - టీడీపీ ఒకటి విడుదల చేశాయి... తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో అంతా ఫ్రీ అంటూ ప్రకటించేశారు. మరీ రేపు ఈ మహాకూటమి అధికారంలోకి వస్తే ఎవరి మేనిఫెస్టోను వీరు అమలు చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.. దీనిపై కూటమి పక్షాలు సమాధానం చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ వస్తోంది.

కాంగ్రెస్ మేనిఫెస్టో త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు నెరవేరుస్తామో లేదో కూడా అంచనా వేయకుండా ఇబ్బడిముబ్బడిగా కహానీలను చెప్పారనే విమర్శలున్నాయి. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తుండడంతో ఇక జాబుల చేయకున్నా నిరుద్యోగులు హాయిగా బతికేయవచ్చని సంబరపడిపోతున్నారట...

ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింలకు వరాల వాన కురిపించారు. నిజానికి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కూటమికే పడుతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీఆర్ ఎస్ - బీజేపీ ఒకటని వారికి వేయవద్దని ప్రచారం చేస్తున్నారు. మరి ముస్లింలు కూడా ఆశ్చర్యపోయేలా వారికి మేనిఫెస్టోలో అలివికాని హామీలిచ్చిన కాంగ్రెస్ వైఖరిపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా హస్తం పార్టీ గెలవడం కోసం సాధ్యమవుతుందా లేదా ఆలోచించకుండా భీకర వాగ్ధానాలిచ్చింది. ఒకవేళ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేయడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి కాంగ్రెస్ అభూతకల్పనల హామీలపై  ఏం సమాధానం ఇస్తుందనేది వేచిచూడాలి.
   

Tags:    

Similar News