తెలంగాణలో అధికార మార్పిడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం ఎలాంటి ప్రయత్నం చేయడానికైనా వెనుకాడేలా లేదు. భద్ర శత్రువుగా తమను భావించే తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు కూడా కాంగ్రెస్ నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన మనుగడ కోసం ఆగర్భ శత్రువుగా భావించే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడాలని నిర్ణయించారు. దీని వల్ల తన శత్రువు కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాజకీయంగా దెబ్బ తీసినట్లు అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఇక ఏ సమయంలో ఎటు వైపు ఉంటారో తెలియని వామపక్షాల నాయకులు మహాకూటమిలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడి వరకూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. అయితే ఇక్కడి నుంచే అసలు సిసలు ఇబ్బంది ప్రారంభం కానుంది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల అనంతరం హంగ్ వస్తే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి తమను ఎక్కడ ఇరుకున పెడతారాననో భయం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. అదే పరిస్ధితి వస్తే ముఖ్యమంత్రితో సహా కీలక పదవుల కోసం చంద్రబాబు నాయుడు పట్టుపట్టే అవకాశముందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
దీనికి విరుగుడుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు - వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీలో కొందరు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. బాహాటంగా కాకపోయినా అంతర్గతంగానైనా జగన్ తో పొత్తు పెట్టుకోవాలని - ఆయనకు బలం ఉన్న స్ధానాల్లో సహకరించమని కోరాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అభిప్రాయంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్న సమయంలో ఆయనతో సఖ్యతగా ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని కొందరు సీనియర్ నాయకులు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా జగన్ వరకూ వెళ్లలేదని - అధిష్టానం ద్రష్టికి తీసుకువెళ్లి వారి అంగీకారంతోనే ఈ స్నేహ హస్తం చాచాలని కొందరు నాయకులు భావిస్తున్నారని సమాచారం. లోపాయికారి ఒప్పందానికి మహాకూటమిలోని మిగిలిన వారి నుంచి కూడా వ్యతిరేకత రాదని వారు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జగన్ కు సన్నిహితంగా ఉన్న వారి చేత ఈ స్నేహ హస్తం గురించి ప్రస్తావించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. జగన్ నుంచి సానుకూలత రాకపోయినా ఎన్నికల అనంతరం వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఇది పనికి వస్తుందని కాంగ్రెస్ నాయకుల ఆలోచనగా చెబుతున్నారు.