తెలంగాణ కాంగ్రెస్ గురించి ఎవరని అడిగినా.. పెద్దలు కొట్టుకుంటున్నారు.. అనే జవాబే వస్తోంది. ఇది నిజమే. కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌లు కేంద్రంగా పెద్దలు.. వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయారు. ఇదికొన్నాళ్లుగా హైదరాబాద్‌ను వేడెక్కిస్తూనే ఉంది. అధిష్టానం వచ్చి.. సర్దు బాటు చేసే ప్రయత్నాలు చేసినా.. నివురుగప్పిన నిప్పు మాదిరిగా పరిస్థితి ఉంది.
అయితే.. ఒక్క హైదరాబాద్‌లోనే కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉందని అంటే.. కుదరదు. పెద్దలను చూసి చిన్నలు నేర్చుకున్నట్టుగా.. జిల్లాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగానే ఉంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పార్టీ నేతలు కీచులాడుకుంటున్నారు. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ నియోజకవర్గానికి ఒకరకంగా.. నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి కొనసాగుతోంది.
నిజామాబాద్ పార్లమెంటు స్థానం దాదాపు కాంగ్రెస్ చేతి నుంచి చేజారిపోయింది. ఇక్కడ పార్టీకి వెన్నుదన్ను ఎవరూ కనిపించడంలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో రెండు ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ దూకుడు కనిపించింది. గత ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది. దీంతో కాంగ్రెస్ మాట ఇప్పుడు వినిపించడం లేదు.
వాస్తవానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిజామాబాద్‌లో సాగిన తర్వాత.. అంతో ఇంతో పుంజుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభకు భారీగా జనం రావడంతో.. కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నాయని అనుకున్నారు. అయితే.. ఇదే నాయకుల్లో గ్రూపులు పెంచేందుకు కారణంగా మారింది. పార్టీ నిస్తేజంగా ఉన్నంతవరకు అంతా బాగానే ఉంది.
ఎన్నికలు 10 నెలలలోపే ఉండటం.. రాహుల్ యాత్ర తర్వాత పట్టు పెరిగిందని భావించడంతో గ్రూపులు పెరిగి కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరికి వారు పంతాలు.. పట్టింపులకు పోతున్నారు. దీంతో జిల్లా పరిస్థితి దారుణంగా ఉంది. ఇదొక్కటే కాదు.. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి ఇలా అనేక జిల్లాల్లో పరిస్థితి ఇలానే ఉంది.