కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ మార్పుకు సిద్ధమైందని తెలుసుకున్న నేతలు క్రమంగా పావులు కదుపుతున్నారు. ఎవరికీవారు వర్గాలుగా విడిపోయి రహస్య భేటీలు పెట్టుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్పు ఖాయమని సంకేతాలు ఢిల్లీ నుంచి రావడంతో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పీసీసీ పదవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే తమను పీసీసీగా ఎంపిక చేయాలని కోరిన సంగతి తెల్సిందే. పీసీసీ రేసులో మల్లు భట్టి విక్రమార్క, కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, వీహెచ్, రేవంత్ రెడ్డిలు ఉన్నారు. అయితే వీరిలో ప్రముఖంగా విన్పిస్తున్న పేరు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డిదే. దీంతో రేసులో వెనుకబడిన నేతలు రహస్య మంతనాలకు సిద్దమవడం ఆసక్తిని రేపుతోంది.
*పీసీసీ కోసం పావులు కదుపుతున్న నేతలు
తెలంగాణలో పీసీసీ మార్పు ఖాయమని తేలడంతో ఆ పదవీకి నేతలు పావులు కదుపుతున్నారు. పీసీసీ పీఠాన్ని ఎలాగైనా తామే దక్కించుకోవాలి.. లేదంటే తమకు అనుకూలమైన వారే పీసీసీలో కొనసాగాలి అన్న రీతిలో కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే పీసీసీ రేసులో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబులు సీఎల్పీ కార్యాలయంలో రెండు గంటలపాటు భేటి అయి మంతనాలు జరిపినట్లు సమాచారం. పీసీసీ మార్పుపై అధిష్టానం తమ నిర్ణయాన్ని కోరితే ఎలా ముందుకెళ్లాలనేది ఈ భేటిలో చర్చించునట్లు తెలుస్తోంది.
*రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లు.
పీసీసీ పదవీ రేసులో ప్రముఖంగా విన్పిస్తున్నది రేవంత్ రెడ్డి పేరే. కాంగ్రెస్ నమ్ముకొని ఇన్నిరోజులు పార్టీకి సేవలు చేసిన నేతకే పీసీసీ ఇవ్వాలని సీనియర్లు కోరుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన నేతకు పీసీసీ పదవీ ఎలా ఇస్తారనే బహిరంగగానే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. జగ్గారెడ్డి, వీహెచ్ హన్మంతరావులు మీడియా ముఖంగానే రేవంత్ ను వ్యతిరేకించిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానం దృష్టిలో పడేందుకు అందించిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నాడు. పీసీసీ మార్పు నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇటీవల మరింత దూకుడు పెంచాడు.
*పీసీసీపై అధిష్టానం నిర్ణయం తీసేసుకుందా?
కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవీకి సంబంధించి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రకటించకుండా గతకొంతకాలంగా వాయిదా వేస్తూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. నేతలు వరుసగా భేటిలవుతూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కే పీసీసీ కట్టబెట్టేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫౌమ్ హౌజ్ ఇష్యూ, పోలీసులపై కోర్టు ధిక్కకరణ కేసుల్లో పోరాటం చేస్తున్నాడు. అలాగే రేవంత్ వ్యతిరేక వర్గం కూాడా రహస్య భేటిలతో మంతనాలు చేస్తూ తమకు అనుకూలమైన వ్యక్తికే పీసీసీ దక్కేలా పావులు కదుపుతున్నారు. పీసీసీ మార్పు ఖాయమని తేలడంతో కాంగ్రెస్ మళ్లీ కాక మొదలైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల గ్రూపు రాజకీయాలు ఇలా ఉంటే శ్రేణులు మాత్రం కొత్త పీసీసీనీ త్వరగా ప్రకటించాలని కోరుతున్నారు.