మనిషన్నాక కూసింత కాదు.. బోలెడంత సానుకూల దృక్ఫధం ఉండాలి. అదే మనిషిని నడిపించటమే కాదు.. కొన్నిసార్లు అసాధ్యమనుకున్నవి కూడా సుసాధ్యమనేలా చేస్తుంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం గురించి.. రాజకీయాల్లో ఇసుమంత అవగాహన ఉన్న వారంతా చెప్పేస్తుంటారు. కానీ.. అలాంటి వాటిని పట్టించుకోకుండా.. మనసులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. అసలు సినిమా ఎంత పెద్దదో తెలుసా? అంటూ మాటలు చెప్పేయటం మామూలు విషయం కాదు. అలా మాటలు చెబితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ మాటల్ని వింటే ఇట్టే అర్థమైపోతుంది.
తాజాగా ఆయన మాటల్ని వింటే.. ఎన్నికల వేళ కాంగ్రెస్ కు విజయం పక్కా అని.. అది కూడా ఎంత భారీగా ఉంటుందో తెలుసా? అంటూ ఆయన చెబుతున్న మాటల్ని వింటే.. ఆశ్చర్యపోవాల్సిందే. గెలవటం తర్వాత.. గెలిపించాలన్న తపన ఉన్నోళ్లకు ఇలాంటి మాటల్ని బోలెడన్ని చెబుతారనుకోవాలి. ఇంతకీ మాణిక్యం ఠాకూర్ మాష్టారు ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. మరింత బాగా అర్థమవుతుంది.
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 41 లక్షల మంది పార్టీ సభ్యులుగా చేరారు. 42 వేల మంది క్రియాశీల సభ్యులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాకు 80 లక్షల ఓట్లు వస్తాయి. 78 స్థానాల్లో విజయం సాధిస్తాం.
- టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. బీజేపీ బుడగలాంటిదని, ఆ పార్టీకి డబుల్ డిజిట్ రాదని, సింగిల్ డిజిట్‌కే పరిమితం.
- బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు క్యూ కడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందన్న ప్రచారంలో నిజం లేదు. బీజేపీలోకి వెళుతున్న బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు క్యూ కడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. బీజేపీలోకి వెళుతున్న నేతలు కాంగ్రెస్ పార్టీలో నిరర్ధక ఆస్తుల్లాంటి వారు. వారు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో నిరర్ధక ఆస్తుల్లాంటి వారు. వారు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదు.
- మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. అక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యనే జరుగుతుంది. టీఆర్‌ఎస్‌తో పాటు రాజగోపాల్‌రెడ్డిపై కూడా అక్కడ వ్యతిరేకత ఉంది.
- పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని అధిష్టానం సులువుగా నిర్ణయించలేదు. అన్ని విధాలా సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంది. నేను ఆయనకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానని అనడంలో వాస్తవం లేదు.
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఎలాంటి విభేదాల్లేవు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ఇద్దరం కలిసి బిర్యానీ కూడా తిన్నాం. అద్దంకి దయాకర్‌నే కాదు.. పార్టీ నుంచి ఎవరినీ సస్పెండ్ చేసే ఆలోచన లేదు.