ఎస్సీ వర్గీకరణపై టీఆర్ ఎస్ పార్టీని - ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి - ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తనపై ఉద్దేశపూర్వక విమర్శలు సరికాదని ఆయన అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ కడియం శ్రీహరి చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి తీసేస్తానని చెప్పినా తాను మాత్రం వర్గీకరణకే కట్టుబడి ఉన్నానని గుర్తు చేశారు. తాజాగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా కట్టుబడి ఉన్నారు.
గత ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని ఉప ముఖ్యమంత్రి కడియం గుర్తు చేవారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వర్గీకరణ చేయాలని కూడా విన్నవించామన్నారు. చట్ట సవరణ - రాజ్యాంగ సవరణ చేయాలని సూచించామని తెలిపారు. తెలంగాణలో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామని చెబుతూ...ఫిబ్రవరి అపాయింట్ మెంట్ కావాలని కోరగా...అందుకు ఓకే చెప్పి....ఆ తరువాత ప్రధానమంత్రి కార్యాలయం అపాయింట్ మెంట్ క్యాన్సిల్ చేసిందని ఉప ముఖ్యమంత్రి కడియం వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పామని కడియం శ్రీహరి వివరించారు. అయితే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ - గుజరాత్ ఎన్నికలు -మెట్రో ప్రారంభం కావడం వల్ల సమయం సరిపోదని తిరస్కరించారని వెల్లడించారు.
ఇటీవల రాజ్ భవన్ లో ఇచ్చిన విందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు - ఎమ్మెల్యే లక్ష్మణ్ హాజరవగా...తన పలుకుబడి ఉపయోగించి అపాయింట్ మెంట్ ఇప్పించాలని కోరినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. ఇదంతా కేంద్రం పరిధిలోని అంశం కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మాదిగ - మాదిగ ఉపకులాలు కోరుతున్నామన్నారు. ఇదంతా ఇష్టం లేకే కేంద్రం వ్యవహరిస్తున్నట్టు అర్థం అవుతుందన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాదిగ సంక్షేమం అంటే తెలియదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది అవకాశవాద రాజకీయమని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుపెటుకున్నప్పటికీ...పక్క రాష్ట్రములో మందకృష్ణను తిరగనువ్వడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని చెప్పిన మందకృష్ణ రాజకీయంగా లబ్ది పొందేందుకే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.