పోలీస్ బాస్ అంటే ఎంత పవర్ ఫుల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అంతటి అధికారం చేతిలో ఉన్నా.. నవ్వుతూ ఉండటం.. సౌమ్యంగా మాట్లాడటం.. గౌరవ మర్యాదల విషయంలో లోటు లేకుండా చూసుకోవటం.. మంచి చేసే వారి విషయంలో గుర్తింపు ఎలానో.. తప్పు చేసే వారి విషయంలో షాకులిచ్చే తీరు తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి సొంతం. తాజాగా ఆయన తీరుకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించటమే కాదు.. అరుదైన గౌరవాన్ని ఆయన పొందారు.
దేశంలోని ఐపీఎస్ అధికారుల్లో అత్యుత్తమ పని తీరు ప్రదర్శించిన టాప్ 25 ఐపీఎస్ అధికారుల్లో మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. ఫేమ్ ఇండియా.. ఆసియా పోస్ట్.. పీఎస్ యూ వాచ్ మీడియా సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేసిన టాప్ 25 జాబితాను సిద్ధం చేశాయి. అందులో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఎనిమిదో స్థానం దక్కింది. మెరుగైన పనితీరుతో సమాజాన్ని మార్చే దిశగా ప్రయత్నిస్తున్న ఉత్తమ అధికారుల్ని ఎంపిక చేశారు.
ఇందుకోసం 1995 ముందు బ్యాచ్ ను కటాఫ్ గా తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగువేల మంది అధికారుల్లో పాతిక అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని అత్యుత్తమ పాతిక మందిని గుర్తించారు. నేరాల కట్టడి.. నిజాయితీ.. నిష్పక్ష పాతంగా విధి నిర్వహణ.. శాంతి భద్రతల పరిరక్షణ.. ఫ్రెండ్లీ పోలీసింగ్.. దార్శనికత.. బాధ్యత లాంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేయగా.. తెలంగాణ పోలీస్ బాస్ ఎనిమిదో స్థానంలో నిలవటం నిజంగా అభినందనీయమే. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి కి కంగ్రాట్స్ చెప్పాల్సిందే.
తనకు లభించిన గౌరవం తనది కాదని.. తెలంగాణ పోలీసులదిగా ఆయన పేర్కొన్నారు. తన ఒక్కడితోనే ఏమీ కాలేదని.. అందరూ కలిసి సమిష్టిగా పని చేయటంతోనే ఇలాంటి గుర్తింపు లభించినట్లుగా చెప్పటం గమనార్హం. ఈ జాబితాలో టాప్ 3లో నిలిచిన అధికారుల్ని చూస్తే.. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అర్వింత్ కుమార్.. రా చీఫ్ సమత్ కుమార్ గోయల్.. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డీజీ ఎస్ఎస్ దేశ్వాల్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు.