వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండటం.. తరచూ టీవీ ఛానళ్లు జరిపే చర్చల్లో హాట్ కామెంట్స్ ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే కత్తి మహేశ్ ను హైదరాబాద్ నగరం నుంచి ఆర్నెల్ల పాటు బహిష్కరణ వేటు వేయటం తెలిసిందే. తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కత్తి మహేశ్ నగర బహిష్కరణపై అధికారిక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఏం చెప్పారన్నది ఆయన మాటల్లో చూస్తే..
= తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తున్నాం అందువల్లే గడిచిన నాలుగేళ్లలో అవాంఛనీయ సంఘటనలేమీ జరగలేదు. ఈ కృషితోనే అత్యున్నత సురక్షిత ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాద్ అవార్డులు అందుకుంటోంది.
= ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో అలజడులు రేకెత్తించేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కత్తి మహేశ్ భావవ్యక్తీకరణ పేరుతో టీవీ ఛానళ్లను వేదికగా చేసుకుని మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు.
= కత్తి మహేశ్ వ్యాఖ్యాలకు నిరసనగా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. భావ వ్యక్తీకరణ అనేది ప్రాథమిక హక్కు అయినా.. దాని కారణంగా సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
= ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి. అందువల్ల ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరిగితే కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. కత్తి మహేశ్‌ను 6 నెలల పాటు నగరం నుంచి బహిష్కరించాం. ఆయన్ని స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలించాం. అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాం.
= కత్తి మహేశ్ ఈ ఆర్నెల్లలో పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేసి విచారిస్తాం. అలా చేస్తే అతడికి మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
= కత్తి మహేశ్ పై ఉన్న బహిష్కరణ వేటును హైదరాబాద్‌కే పరిమితం చేయాలా? మొత్తం తెలంగాణకు బహిష్కరించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
= ప్రపంచంలోని ఎక్కడివారైనా నగరానికి వచ్చి తమ పని తాము చేసుకోవచ్చు. కానీ సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఉపేక్షించబోం. ఇది ప్రజానీకానికి తెలియజెప్పడానికే కత్తి మహేశ్‌పై కఠినచర్యలు తీసుకున్నాం. ఇలాంటి వ్యక్తులకు సహకరించిన వారిపైనా చర్యలు తీసుకుంటాం.
= ఓ టీవీ ఛానల్ కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేసింది. ఇది సమాజానికి మంచిది కాదు. ఆ టీవీ ఛానల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశాం. వారిచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఇలాంటి వ్యాఖ్యాలను ప్రసారం చేయడంలో జాగ్రత్త వహించాలి.
= శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం, ప్రజలు, మీడియా, ప్రభుత్వ సంస్థలది కీలక పాత్ర. సమాజంలో అలజడి రేకెత్తించేందుకు ఎవరైతే ప్రయత్నిన్నారో.. వారిని తెలంగాణ అభివృద్ధికి ఆటంకులుగా అనుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలపై ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా అంతా సమయమనం వ్యవహరించాలి