తెలంగాణ యువతి.. కీర్తిరెడ్డికి ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం..!

Update: 2021-02-06 07:30 GMT
హైదరాబాద్​ కు చెందిన కీర్తిరెడ్డి (24) కొత్త అరుదైన గౌరవం పొందారు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రికలో ఆమె చోటు సంపాదించుకున్నారు. కీర్తిరెడ్డి .. మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి కూతురు. అయితే ఫోర్బ్స్‌ ఇటీవల 30 ఏళ్లలోపు వయసు ఉండి వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతుల జాబితాను వెలువరించారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి కీర్తి చోటు సంపాదించారు. ఫోర్బ్స్‌ పత్రిక.. ‘30 అండర్‌ 30’లో జాబితాను రూపొందించింది.

‘స్టాట్విగ్‌’ అనే బ్లాక్‌ చైన్‌ సాంకేతికత ఆధారిత వ్యాక్సిన్‌ సరఫరా నిర్వహణ ప్లాట్‌ ఫాంకు కీర్తిరెడ్డి సీఈవోగా కొనసాగుతున్నారు.ఇటీవల కరోనా వ్యాక్సిన్​ పంపిణీలో ఆమె విశేషమైన కృషి చేశారు. దీంతో  ఫోర్బ్స్‌ ఆమె సేవలను గుర్తించింది.కరోనాను తరిమికొట్టేందుకు కీర్తి రెడ్డి ఎంతో కృషి చేశారని ఫోర్బ్స్‌ ప్రశంసించింది.  కీర్తి రెడ్డి... ద లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ నుంచి మేనేజ్‌ మెంట్‌ లో గ్లోబల్‌ మాస్టర్స్‌ పట్టాను పొందారు. అంతేకాక ఆమె చాలాకాలంగా ఆహారం నుంచి వచ్చే వృథాను అరికట్టేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు.

చాలా చిన్నవయసులోనే కీర్తి ఈ ఘనత సాధించడం గమనార్హం. ఈ జాబితాలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేశ్ కు కూడా చోటు దక్కింది.  ఆమెతో పాటు అమూల్‌కూల్‌ బ్రాండ్‌ మేనేజర్‌ షెఫాలీ విజయ్‌ వర్గీయ - ఏపీఏసీ లీడ్‌ నిహారిక కపూర్‌, యూ ట్యూబ్‌ కమ్యూనిటీ - అండ్‌ సోషియల్‌ మీడియా సపోర్ట్‌ ఆపరేషన్స్‌ నిషిత బలియార్‌ సింగ్‌ - నెక్సస్‌ పవర్‌ సహ వ్యవస్థాపకులు నికిత బలియార్‌ సింగ్‌ - సుప్రీం కోర్టు న్యాయవాది పౌలోమీ పావని శుక్లా - ప్రముఖ సినీ మరో నటి తృప్తి దిమ్రి - గాయకురాలు మాళవిక మనోజ్‌ తదితరులు చోటు దక్కించుకున్నారు.
Tags:    

Similar News