హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న డ్రగ్స్ ముఠాతో లింక్ లు ఉన్న మరో నలుగురిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. వీరిలో ముగ్గురు బీటెక్ చదువుకున్నవిద్యార్థులు కాగా, మరొకరు బడా గేమింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడని ఆయన చెప్పారు. తాజాగా అరెస్టయిన నలుగురు కూడా డ్రగ్స్ సరఫరా చేసేవారేనని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.
నగరంలోని పలు బడా పాఠశాలలు, కాలేజీలకు చెందిన 1275 మంది విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటుపడినట్టు తమ విచారణలో తేలిందన్నారు. అయితే, డ్రగ్స్ బాధితులు ఎవరినీ అరెస్టు చేయబోమని, వారి పేర్లను కూడా బయట పెట్టబోమని ఆయన హామీ ఇచ్చారు. తెలిసీ తెలియక డ్రగ్స్ తీసుకొని ఉంటే వెంటనే ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులు లేదా ఉపాధ్యాయులకు తెలపాలని ఆయన సూచించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, ఇలాంటి తప్పుడు భవిష్యత్తులో పునరావృతం చేయొద్దని హెచ్చరించారు.
ధనిక, మధ్య తరగతి అనే తేడా లేదని, వారానికి రూ. 4వేలు ఖర్చు చేయగలిగిన వారు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. డ్రగ్స్ తీసుకొనే విద్యార్థుల పేర్లను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెల్లడించడం లేదని, వారిని అరెస్టు చేయబోమని స్పష్టం చేశారు.
విద్యార్థులకు సంబంధించిన అంశం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సినీప్రముఖులు, ఐటీ ఉద్యోగుల విషయంలో విచారణ చేపడతామన్నారు. నిందితులను విచారణ చేస్తున్నామని, ఏ విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని, ఏయే కాలేజీలు, పాఠశాలలకు ఎక్కువ డ్రగ్స్ సరఫరా అవుతుందనే విషయాలను అరెస్టయిన డ్రగ్స్ ముఠా సభ్యుల ద్వారా తెలుసుకుంటున్నట్టు చెప్పారు.