ఈరోజు మధ్యాహ్నం కాకినాడ జేఎంటీయూ లో జరగనున్న ఆత్మగౌరవ సభపై ఆసక్తి క్షణ క్షణం పెరుగుతూనే ఉంది. ఈ ఆత్మగౌరవ సభకు ఏపీ వాసులు - జనసేన కార్యకర్తలు - పవన్ అభిమానులు పెద్ద ఎత్తున రానున్నారని సమాచారం. అయితే ఈ సభకు ఏపీ జనాలు ఎంతమంది వచ్చినా అది పెద్ద విషయం అవునో కాదో కానీ.. తెలంగాణ నుంచి కూడా జనాలు తరలివస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన సభకు తెలంగాణలోని పవన్ కల్యాణ్ అభిమానులు కూడా తండొపతండాలుగా వస్తున్నారట. ఈ విషయంపై సీమాంధ్ర జనసేన పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే "ప్రత్యేక హోదా ఇవ్వం" అని కేంద్ర ప్రభుత్వం సుస్పష్టంగా ప్రకటించేయడం, అయినా పర్లేదు "జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నాం" అని ఏపీ ముఖ్యమంత్రి చెప్పేయడం తెలిసిందే. అయితే ఈ ప్రకటనల తర్వాత సెప్టెంబర్ 10న జనసేన తో పాటు మిగిలిన పార్టీలు - ప్రజా సంఘాలు - ప్రజలు రాష్ట్ర బందు కూడా చేయబోతున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఏర్పాటుచేసిన "సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ" పై ఆసక్తి తీవ్రతరం అవుతుంది. అయితే ఈ సభకు తెలంగాణలోని పది జిల్లాల నుంచి యువత ఇప్పటికే కాకినాడలోని జేఎన్డీయూ మైదానానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతున్న పవన్ తెలంగాణ అభిమానులు... తామంతా పవన్ ఫ్యాన్స్ మని - ఆయన ఏమి మాట్లాడతారో వినాలనే ఆశతో ఇంతదూరం వచ్చామని చెబుతున్నారు. తెలుగు ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలని, అందుకే ఈ ప్రత్యేక హోదా ఉద్యమానికి తమ మద్దతు ఇస్తున్నామని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అన్ని జిల్లాల నుంచి తమకు మద్దతుగా వచ్చిన తెలంగాణ పవన్ కల్యాణ్ అభిమానులకు పాదాభివందనాలు అని చెబుతున్నారు సీమాంధ్ర జనసేన కార్యకర్తలు. కాగా... ఈ సభకు మూడంచెల బారికేడ్లు - భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసు వర్గాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా నగరమంతా భారీ ఎత్తున మోహరించారు.