ఎంతైనా ధనిక రాష్ట్రం మరీ.. మిగులు బడ్జెట్ తో విడిపోయింది. అందుకే పాలకులు కూడా ప్రచార ఆర్భాటం కోసం తపించారు. బాగానే ఖర్చు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తెలంగాణ ప్రభుత్వం 2014-18 మధ్యలో వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కోసం చేసిన ఖర్చు అక్షరాల రూ.310 కోట్లు.
ఓ సంస్థ స.హ. చట్టం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ప్రచార ఖర్చుపై వివరాలు కోరగా.. తాజాగా సమాచారం వచ్చింది. ఇందులో గత నాలుగున్నర ఏళ్లలోనే మీడియాలో తెలంగాణ ప్రభుత్వం ప్రచారం కోసం ఇంత భారీగా ఖర్చు చేసిందని వెల్లడైంది.
ఇందులో అన్నింటికంటే విశేషం ఏంటంటే.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేయడానికి రూ.1 కోటి ఖర్చయ్యిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తేలింది.
కాగా 2018 తర్వాత జరిగిన ప్రచార ఖర్చుల వివరాలు తెలియాల్సి ఉంది. నాలుగేళ్లకు సంబంధించిన సమాచారం మాత్రమే లభ్యమైంది. ఈ రెండు మూడేళ్లలో ఎంత ఖర్చయ్యిందనే వివరాలు తెలుపలేదు.